Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతుబంధుకు దీవెనలు

-రూ.4,700 కోట్లు డ్రా చేసుకున్న రైతులు -నేటినుంచి మండల కార్యాలయాల్లో పాస్‌పుస్తకాలు, చెక్కులు పంపిణీ -రైతులకు అందజేయనున్న తహసీల్దార్లు -గ్రామసభల్లో లక్ష మంది రైతులకు కొత్తగా ఆధార్ సీడింగ్ -తప్పులు దొర్లిన పుస్తకాల పునర్ముద్రణ.. ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ సమీక్ష -సంస్థలు, దేవాదాయ భూములకు పాస్‌పుస్తకాలు ఇచ్చే అంశంపై నిర్ణయం -11 రోజుల్లో 37 లక్షల పాస్‌పుస్తకాలు -44 లక్షలకు పైగా చెక్కులు పంపిణీ

రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు పండుగ వాతావరణం 11వ రోజు కూడా కొనసాగింది. ఆదివారం జరిగిన రైతుబంధు కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రైతులకు రైతుబంధు చెక్కులు, పాస్‌పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ దయాకర్, ఎమ్మె ల్యే ఆరూరి రమేశ్, జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్, మామడ మండలాల్లో జరిగిన కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రైతులకు చెక్కులు, పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. యాదాద్రి -భువనగిరి జిల్లా వీరవెళ్లిలో ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కుసుకుంట్ల శేఖర్‌రెడ్డి రైతులకు చెక్కులు పంపిణీ చేశారు. కాగా, రైతులు శనివారంనాటికి బ్యాంకుల నుంచి రూ.4,700 కోట్ల నగదును డ్రా చేసుకున్నట్టు వ్యవసాయశాఖ అధికారులు చెప్పారు. రైతుబంధు కార్యక్రమంలో ఇప్పటివరకు 37 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలు, 44 లక్షలకుపైగా రైతుబంధు చెక్కులను పంపిణీచేశారు. మిగిలిన పాస్‌పుస్తకాలు, చెక్కులను సోమవారం నుంచి మండల రెవెన్యూ కార్యాలయాల్లో తహసీల్దార్లు సదరు రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన రైతుబంధు కార్యక్రమంలో రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా గ్రామాల్లో పట్టాదార్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులను పంపిణీ చేశారు. వీటిని అందుకున్న రైతులు ఆనందంతో ఉన్నారు. రైతులకు అండగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న సీఎం కేసీఆర్‌పై అన్నదాతలు ప్రశంసలు కురిపిస్తున్నారు..దీవెనలు అందిస్తున్నారు. అయితే, కొంతమంది రైతుల ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోవడంతో ఆ మేరకు పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణ జరుగలేదు. గ్రామసభలో పట్టాదార్‌పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంగా లక్షమంది రైతులు తమ భూమి ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేశారు.

ఇలా అనుసంధానమైన రైతుల పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణ వెంటనే చేపడుతున్నారు. ప్రతి రైతుకు చెందిన ఖాతాలోని భూమి వివరాలను, భూరికార్డుల ప్రక్షాళనలో వచ్చి న డాటాను పరిశీలించి ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ముద్రణకు పంపించినప్పటికీ, కొన్ని పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లాయి. ఇలాంటివాటిని రైతులకు అందించకుండా వెంటనే వాటిని సరిచేసి రీ ప్రింటింగ్ చేయిస్తున్నారు. ఇప్పటికే లక్షకుపైగా పట్టాదార్ పాస్‌పుస్తకాల ముద్రణ చేపట్టారు. కాగా, ఇప్పటివరకు దాదాపు 50 లక్షల పట్టాదార్ పాస్‌పుస్తకాలను ముద్రించారు. ఇందులో 37 లక్షల వరకు పంపిణీ చేశారు. ఇంకా 13 లక్షలు పంపిణీ చేయాల్సి ఉన్నది. వీటిని సోమవారం నుంచి నెలరోజులపాటు మండల కార్యాలయాల్లో రైతులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇం దుకు మండల కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేశారు. ఇదే సమయంలో తప్పులు దొర్లినవి పునర్ముద్రణ చేసి అందించాలని నిర్ణయించారు. ఇవికాకుండా ఆధార్ సీడింగ్ కానివి, వివిధ సంస్థలకు చెందినవి, విదేశాల్లో ఉన్న రైతులవి అన్నీకలిపి మరో ఏడు లక్షల వరకు ఉంటాయి. వీటన్నింటిని కూడా పంపిణీ చేయాల్సి ఉన్నది. వీటితోపాటుగా కొత్తగా ఆధార్‌సీడింగ్ అయిన వాటిని కూడా వెంటనే ముద్రిస్తారు.

ఒకట్రెండు రోజుల్లో సీఎం సమీక్ష రాష్ట్రవ్యాప్తంగా పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ, రైతుబంధు చెక్కుల పంపిణీ ఎలా జరిగిందనేదానిపై ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమీక్షించే అవకాశముంది. ఈ సమావేశంలోనే వివిధ సంస్థలకు ఉన్న భూములకు, దేవాదాయశాఖ భూములకు పాస్‌పుస్తకాలు ఇచ్చే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.