Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేటినుంచి అసెంబ్లీ

-ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన కొలువుదీరనున్న సభ
-తొలుత సీఎం, తర్వాత మహిళాసభ్యుల ప్రమాణం
-నేడు స్పీకర్ పదవికి నామినేషన్.. 18న ఎన్నిక
-19న గవర్నర్ ప్రసంగం.. 20న ధన్యవాద తీర్మానం
-నేటినుంచి అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో అసెంబ్లీ తొలిసారిగా గురువారం కొలువుదీరుతున్నది. ఈ సమావేశాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ కోసం బుధవారం రాజ్‌భవన్‌లో సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు. గురువారం ఉదయం 11.30 గంటలకు ముంతాజ్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశమవుతుంది. అంతకుముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతోపాటు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచే అసెంబ్లీకి తరలివెళ్తారు. 11.05 గంటల నుంచి అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణం చేయిస్తారు.

ముందుగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, తర్వాత మహిళాసభ్యులు ప్రమాణం స్వీకరిస్తారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న అక్షరమాల ఆధారంగా మిగతాసభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారు. అనంతరం సభ్యులందరికీ జూబ్లీహాల్‌లో ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు గురువారం నామినేషన్లు దాఖలుచేయాలని శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీచేశారు. స్పీకర్‌గా పోటీచేయాలనుకొనే సభ్యులు గురువారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. స్పీకర్ అభ్యర్థి ఎంపికపై సీఎం కేసీఆర్ గురువారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఆ నిర్ణయం ప్రకారం టీఆర్‌ఎస్ నుంచి స్పీకర్ అభ్యర్థి నామినేషన్ దాఖలుచేస్తారు. ఈ ఎన్నిక ఏకగ్రీమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. గవర్నర్ నరసింహన్ 19న ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీ, కౌన్సిల్‌లో వేర్వేరుగా చర్చ జరుగుతుంది. ఈ చర్చను అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ ప్రారంభిస్తారు. ప్రశాంత్‌రెడ్డి తదితరులు మాట్లాడుతారని తెలిసింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి అసెంబ్లీ, కౌన్సిల్ ధనవ్యాదాలు తెలుపుతూ తీర్మానం చేయనున్నాయి.

సభలు.. ర్యాలీలు రద్దు
శాసనసభ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ, కౌన్సిల్‌హాల్ చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులు గురువారం ఉదయం 6 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున సభ లు, సమావేశాలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించవద్దని కోరారు.

స్పీకర్ ఏకగ్రీవం కోసం సహకరించండి
-ఉత్తమ్, అసద్, లక్ష్మణ్‌లతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం కేసీఆర్
-సీఎం ప్రతిపాదనకు ఎంఐఎం, బీజేపీ అంగీకారం
-నేడు నిర్ణయం ప్రకటిస్తామన్నపీసీసీ అధ్యక్షుడు
స్పీకర్‌ను ఏకగ్రీవం చేద్దాం సహకరించాలని ప్రతిపక్షాలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి

అసెంబ్లీ స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు సహకరించాలని ప్రతిపక్ష పార్టీలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తిచేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌తో బుధవారం సాయంత్రం సీఎం కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడారు. స్పీకర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని ప్రతిపాదించగా, ఎంఐఎం, బీజేపీ అధ్యక్షులు వెంటనే అంగీకారం తెలిపారు. పార్టీలో చర్చించి గురువారం ఉదయం నిర్ణయం ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ బదులిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.