Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కంటి వెలుగుకు విశేష స్పందన

-4 రోజుల్లో 3,23,956 మందికి పరీక్షలు -35,721 మందికి కండ్లద్దాలు పంపిణీ -35,721 మందికి కండ్లద్దాలు పంపిణీ -2,351 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు పూర్తి -సోమవారం ఒక్కరోజే 92,119 మందికి పరీక్షలు -శస్త్రచికిత్సల వేగవంతానికి చర్యలు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా నేత్రవైద్య శిబిరాల్లో గత నాలుగు రోజులుగా 3,23,956 మందికి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 87,904 మందికి ఎటువంటి కంటి సమస్యలు లేవని వైద్యులు నిర్ధారించారు. 35,721 మందికి కండ్లద్దాలను అందజేశారు. ప్రత్యేక దృష్టిలోపం ఉన్న వారికోసం 51,030 అద్దాలను ప్రతిపాదించిన వైద్యులు.. 48,088 మందిని కాటారాక్ట్ ఆపరేషన్లకు ప్రతిపాదించగా ఇప్పటివరకు 2,351 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయి. ఈ ఆపరేషన్లతోపాటు ఇతర శస్త్రచికిత్సలను వేగవంతంగా నిర్వహించేందుకు వైద్యశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 114 దవాఖానల్లో కాటరాక్ట్ ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 822 చోట్ల నిర్వహించిన శిబిరాల్లో 92,119 కంటి పరీక్షలు చేయించుకున్నారు. 5,272 మందికి కండ్లద్దాలను అందజేశారు. దృష్టిలోపం ఉన్నవారికి 6,873 ప్రత్యేక అద్దాలను ప్రతిపాదించిన వైద్యులు.. కాటరాక్ట్ ఆపరేషన్లకు 11,090 మందిని ప్రతిపాదించి, 703 కాటరాక్ట్ ఆపరేషన్లను నిర్వహించారు.

ఖమ్మం జిల్లాలో.. ఖమ్మంజిల్లాలో సోమవారం నాటికి 32 వైద్యశిబిరాల ద్వారా 11,450 మందికి పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 2,268 కళ్లద్దాలను పంపిణీచేశారు. శస్త్ర చికిత్సలు, ఇతర వైద్యసాయం కోసం 2,295 మంది వివరాలను ఆన్‌లైన్ ద్వారా సిఫారసు చేశారు. మొత్తం 19 గ్రామాల్లో కంటి వెలుగు ప్రక్రియ పూర్తయ్యింది. సోమవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి.. కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్‌తో కలిసి కంటి వెలుగు శిబిరాలను పరిశీలించారు.

మెదక్ జిల్లాలో 2,616 మందికి పరీక్షలు మెదక్ జిల్లాలో సోమవారం 2,616 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 89 మందికి అద్దాలను పంపిణీచేయగా, 155 మందిని ఆపరేషన్ల కోసం రెఫర్‌చేశారు. జిల్లాలో 19 పీహెచ్‌సీలు, ఒక అర్బన్ సెంటర్‌లో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతున్నది. మొత్తం 19 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో.. యాదాద్రి భువనగిరి జిల్లాలో కంటి వెలుగుకు విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం మోటకొండూర్‌లో 165 మందికి పరీక్షలు నిర్వహించి 42 మందికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 43 మందిని కాటరాక్ట్ ఆపరేషన్లకు రెఫర్ చేశారు. యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లిలో 100 మందికి పరీక్షలు నిర్వహించి 30 మంది మందికి కంటి అద్దాలు అందజేరు. మరో 18 మం దిని శస్త్ర చికిత్స కోసం రెఫర్ చేశారు.

కేసీఆర్ నిజంగా దేవుడు..! -కంటి వెలుగులో పరీక్షలు చేయించుకున్న వృద్ధురాలు -ఆ తర్వాత సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టిన వైనం

మంచిర్యాల: కండ్లు సరిగా కనిపించని తమ లాంటి పేదలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహించి వెలుగును ప్రసాదిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా దేవుడని, ఆయన ఔదర్యాన్ని జన్మలో మర్చిపోలేమని పుప్పాల శంకరమ్మ అనే వృద్ధురాలు పేర్కొన్నది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డే-కేర్ సెంటర్‌లో సోమవారం ఆమె కంటి వెలుగు పరీక్షలు చేయించుకున్నది. శంకరమ్మకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని చెప్పారు. పరీక్షలకు ముందు, పరీక్షలు చేయించుకున్న తర్వాత అక్కడ ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్ ఫొటోను చూసి సార్ మీరు నిజంగా దేవుడు అంటూ పుప్పాల శంకరమ్మ దండం పెట్టింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.