Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎమ్మెల్యే కేటీఆర్ కి పార్టీ నాయకుల శుభాకాంక్షల వెల్లువ

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ గారికి పార్టీ నాయకుల శుభాకాంక్షల వెల్లువ…

మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, పద్మారావు గౌడ్ ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు తదితరులు కేటీఆర్ కి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు..

బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ కలిసేందుకు కార్యకర్తలు అభిమానులు ,నాయకులు పోటెత్తారు. క్యాంపు కార్యాలయంలో వందలాది మంది కార్యకర్తలను, నాయకులను కలుసుకున్న అనంతరం మంత్రి స్వయంగా పార్టీలోని సీనియర్ నాయకులు ఇళ్లకు వెళ్లి కలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి సెక్రెటరీ జనరల్ కే కేశవరావు ఇంటికి వెళ్లి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. దీంతోపాటు సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అయిన నాయిని నరసింహారెడ్డి, ప్రస్తుత హోం మంత్రి మహమూద్ ఆలీ, మరో సీనియర్ మంత్రి హరీష్ రావు ను స్వయంగా వెళ్లి కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా వారంతా మంత్రి కేటీఆర్ రానున్న రోజుల్లో పార్టీ నీ మరింత బలోపేతం చేసే దిశగా పని చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా పార్టీకి ఆయన అందిస్తున్న విశేష సేవలకు ఈ సందర్భంగా తెలియజేశారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో పార్టీ మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

నూతనంగా ఎన్నికైన అనేక మంది ఎమ్మెల్యేలు కేటీఆర్ ను కలిసి అభినందనలు తెలియజేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కేటిఆర్ కి ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు.

అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్ కి రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని హాజరయ్యేందుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పెద్ద ఎత్తున మంత్రికి స్వాగతం తెలిపారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసిన అనంతరం,ఆచార్య జయశంకర్ విగ్రహానికి మంత్రి నివాళులు అర్పించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శంబిపూర్ రాజు, నగర ఎమ్మెల్యేలు పలువురు కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు.

కేటిఆర్ నన్ను మర్యాదపూర్వకంగా కలిశారు : హరీష్ రావు
కే.టి.ఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే హరీష్ రావు. భవిష్యత్ లో కేటిఆర్ మరింత పేరు తెచ్చుకోవాలని అన్నారు. కేసీఆర్ కు కేటిఆర్ మరియు నేను చేదోడు వాదోడుగా ఉంటూ రేపు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో అన్ని విధాలుగా కలిసి పనిచేస్తామని తెలియజేసారు.

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కేటీఆర్‌‌‌కు జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమించిన సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు.సమర్థత, కార్య దీక్షా దక్షత, రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నేత, మంచి వాక్చాతుర్యం కలిగిన యువ నాయకుడు కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ మున్ముందు మరిన్ని విజయాలు సాధిస్తుందని అన్నారు. రాజకీయ అపర చాణక్యుడు తండ్రి కేసీఆర్ గారి నుంచి నాయకత్వ లక్షణాలు పుణికిపుచ్చుకున్న కేటీఆర్ ఈ నాలుగున్నరేండ్లలోనే జరిగిన అన్ని ఎన్నికలల్లో టీఆర్ఎస్ పార్టీని విజయపథంలో నడిపించారని కొనియాడారు. కేటీఆర్ నాయకత్వంలో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త సుశిక్షితుడైన గులాబీ సైనికుడిలా ప్రజా క్షేత్రంలో పని చేస్తారని, టీఆర్ఎస్ పార్టీ మున్ముందు అజేయశక్తిగా మారుతుందని లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు.

కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు నిర్మ‌ల్ ఎమ్మెల్యే ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలిసి అభినందించారు.

కేసీఆర్ గారి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న : ఈటల రాజేందర్. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీఆర్ గారికి అభినందనలు తెలిపిన ఈటెల రాజేందర్. . కేటీఆర్ గారి నాయకత్వం లో TRS మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను..

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.