వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ అథారిటీ : సీఎం

జిల్లా అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందులాల్, జిల్లా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

KCR-review-meet-on-warangal-development

సమావేశం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ…హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో అతిపెద్ద నగరం వరంగల్. వరంగల్ అభివృద్ధి కోసం స్పెషల్ అథారిటీ డెవలప్‌మెంట్ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. వరంగల్‌కు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయిస్తామన్నారు. దేశంలోనే అతిపెద్ద మల్టీపుల్ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు. కాటన్ నుంచి గార్మెంట్ దాకా టెక్స్‌టైల్స్ పార్క్‌లో తయారయ్యే విధంగా ఏర్పాటు ఉంటుందన్నారు. వచ్చే మూడు నాలుగేళ్లలో వరంగల్ నగరంలో 4.5 లక్షల జనాభా పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగునంగా అభివృద్ధి చేస్తామన్నారు.