టిఆర్ఎస్ ప్రమేయం లేకుంటే ప్రకటన ఎలా చేశారు ?

-కెసిఆర్ దీక్షతోనే 2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటు ప్రకటన
-ఉద్యమం ఉవ్వెత్తున ఎగియడంతోనే తెలంగాణా రాష్ట్రం సాధ్యమైంది
-మంత్రులు ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా ?:హరీష్ రావు
-మైనారిటిలకు 12 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా కల్పిస్తామని హామీ

Harish Rao 01

టిఆర్ఎస్ ప్రమేయం లేకుండా తెలంగాణ ఇచ్చామని సోనియాగాంధీ అన్నారు. తెలంగాణ కోసం కేసిఆర్ నిరాహార దీక్ష చేస్తే డిసెంబర్ 9 న హోంమంత్రి  చిదంబరంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎందుకు ప్రకటన   చేయించారు అని టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నించారు. ఆనాటి ప్రకటన వెనక్కిపోవటంతోనే టిఆర్ఎస్ అన్ని వర్గాలను కలుపుకొని మహోద్యమం చేపట్టి తెలంగాణ సాధించిందని చెప్పారు. కెసిఆర్ తెలంగాణ తీసుకొస్తే కాంగ్రెస్ వాళ్ళు సోనియాగాంధి గారి దయతో తెలంగాణ వచ్చింది అంటున్నారు ఎప్పుడైనా గీతారెడ్డి, దామోదర రాజనర్సింహ ఉద్యమంలో పాల్గొన్నారా అని ప్రశ్నించారు. గురువారం మెదక్ జిల్లా జహీరాబాద్ లోని సుభాష్ గంజ్ లో  నిర్వహించిన బహిరంగసభలో హరీష్ రావు ప్రసంగించారు. కరీంనగర్ లో సోనియా సభకు ఎంతమంది వచ్చారో అందరికి తెలుసని అదే కేసిఆర్ సభకు రెండు లక్షల మంది తరలివచారన్నారు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమన్నారు తెలంగాణలో టిడిపి దుకాణం ఖాలి అయ్యిందన్నారు. చంద్రబాబునాయుడు వెంకయ్యనాయుడు కలిసి భద్రాచలంను ఆంధ్రలో కలిపేందుకు కుట్ర పన్నుతున్నారు ఆంధ్ర ఉద్యోగులు వెళ్ళిపోతేనే తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు టిఆర్ఎస్ గెలవగానే ఆంధ్ర ఉద్యోగులను ఎపి ప్రభుత్వానికి పంపే భాద్యత తీసుకుంటుందన్నారు.

టిడిపి కి ఓటేస్తే నరేంద్రమోడికి వేసినట్లే: తెలంగాణను అడ్డుకున్నది చంద్రబాబేనని టిడిపికి ఓటేస్తే నరేంద్రమోడికి వేసినట్టేనని హరీష్ హెచ్చరించారు. మైనారిటీలు అలోచించి ఓటు వేయాలని కోరారు. కేసిఆర్ కేంద్రంలో మూడో కూటమి ఏర్పాటు చేస్తామన్నారే తప్పా ఎన్డీఏకు ఎప్పుడు మద్దతు ఇవ్వమని ప్రకటించారన్నారు. టిఆర్ఎస్ అధికారంలోకి రాగానే మైనారిటిలకు 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారన్నారు రిజర్వేషన్ అమలుకోసం పార్లమెంట్లో బిల్లు ఆమోదింపజేసె భాద్యత టిఆర్ఎస్ తీసుకుంటుందన్నారు సచార్ కమిటీ సిఫార్సలను అమలుచేస్తామన్నారు.