టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యలు

-కేసీఆర్‌ను కలిసిన నిరుద్యోగ వికలాంగుల సంఘం నేతలు

టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల సమస్యలను చేరుస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. గురువారం అన్ ఎంప్లాయిడ్ డిజేబుల్డ్ అసోసియేషన్ ఆఫ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతినిధులు కేసీఆర్‌ను కలిశారు. అలుపెరుగని పోరాటంతో తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు వారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వారి వినతులను సావధానంగా విన్న కేసీఆర్ త్వరలో వాటిపై కీలక నిర్ణయం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ రియాజ్, ఉపాధ్యక్షుడు కే భాస్కర్, ప్రధానకార్యదర్శి ఐలయ్య, షర్ఫుద్దీన్, కోటేశ్వర్‌రావు, బాల్‌రాజ్, నరేష్, అంజయ్య, యుగేందర్ తదితరులున్నారు.