తెలుగులో పసునూరి ప్రమాణం

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన పసునూరి దయాకర్ గురువారం ఉదయం లోక్‌సభలో తెలుగులో ప్రమాణం చేశారు. సభ ఉదయం 11.02 గంటలకు ప్రారంభం కాగానే జాతీయ గీతాలాపన జరిగింది. అనంతరం వరంగల్ ఎంపీగా గెలిచిన పసునూరి దయాకర్‌తో సెక్రటరీ జనరల్ ప్రమాణం చేయించారు.

Pasunuri-Dayakar-Takes-oath-as-MP-01

 

తెలుగులో ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు ముందుగానే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇవ్వడంతో దానికి తగిన ఏర్పాట్లు జరిగాయి. పసునూరి దయాకర్ అను నేను లోక్‌సభ సభ్యుడిగా ఎన్నుకోబడినందున చట్టరీత్యా నెలకొనబడిన భారత సంవిధానం పట్ల యదార్థమైన భక్తి విశ్వాసములు కలిగియుందుననియు, భారతదేశపు సర్వసత్తాకాధికారమును, అఖండతను సమర్థించెదననియు, నేను స్వీకరింపబోవు కర్తవ్యమును శ్రద్ధాసక్తులతో నిర్వహించెదననియు దైవసాక్షిగా ప్రమాణము చేయుచున్నాను అని దయాకర్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎంపీలు, దయాకర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం పసుసూరి దయాకర్‌ను ప్రధానికి, పలువురు కేంద్ర మంత్రులకు లోక్‌సభలో టీఆర్‌ఎస్‌పక్ష నేత జితేందర్‌రెడ్డి పరిచయం చేశారు.