తెలంగాణకు నిధులేవీ?

-రైల్వే బడ్జెట్‌పై సీఎం కేసీఆర్ పెదవి విరుపు
-బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని వ్యాఖ్యహైదరాబాద్

KCR 02

 

రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్టును కూడా ప్రకటించలేదు. కేంద్రంలో గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదు. బడ్జెట్‌లో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రస్తావనే లేదు. – ముఖ్యమంత్రి కేసీఆర్

కేంద్ర రైల్వే బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పెదవి విరిచారు. తెలంగాణకు కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ కూడా ప్రకటించక పోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మాదిరిగానే బీజేపీ ప్రభుత్వం కూడా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ, కాజీపేట డివిజన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నో ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమవుతున్న కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీని కేంద్రం పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే సర్వే పూర్తయిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించక పోవడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశ పనులకు రూ.20 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.