తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు కేటీఆర్

-కార్యదర్శిగా పుల్లెల గోపీచంద్
-నూతన కార్యవర్గం ఏర్పాటు

KTR
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తొలి తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం (టీబీఏ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం నుంచి విడిపోయి తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అవతరించింది. ఖైరతాబాద్‌లోని టీజీవీ టవర్స్‌లో ఆదివారం జరిగిన ఏపీ బ్యాడ్మింటన్ సంఘం జనరల్ కౌన్సిల్‌లో తెలంగాణ, ఏపీ సంఘాల కార్యవర్గాలను ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సంఘం చీఫ్‌గా తారక రామారావు, కార్యదర్శిగా పద్మభూషణ్ అవార్డు గ్రహీత, జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ ఎన్నికయ్యారు.

కరీంనగర్‌కు చెందిన వై ఉపేందర్ రావు సీనియర్ ఉపాధ్యక్షునిగా, హైదరాబాద్‌కు చెందిన కే ఫణిరావు కోశాధికారిగా ఎన్నికయ్యారు. వ్యవహరించనున్నారు. ఏపీ సంఘం కార్యదర్శిగా సీహెచ్ పున్నయ్య చౌదరి, ఈ ఎన్నికలకు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ప్రతినిధిగా సీనియర్ అధికారి టీ రవీందర్ రావు హాజరుకాగా, రిటైర్డ్ జిల్లా జడ్జి జస్టిస్ నవమోహన్ రావు రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు.