సమస్యలు లేని పల్లెలే లక్ష్యం

గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన గ్రామజ్యోతితో పల్లెలన్నీ ప్రగతిపథంలో నడుస్తాయి. గ్రామాలకు మంజూరయ్యే నిధులను నిష్పక్షపాతంగా ఖర్చు చేసేందుకు, అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచేందుకే సీఎం కేసీఆర్ గ్రామజ్యోతికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి. సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీలు, అధికారులు సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలి.

Etela Rajendar takes part in Grama Jyothi in Karimnagar distrcit

-నిధులు నిష్పక్షపాతంగా ఖర్చు చేసేందుకే గ్రామజ్యోతి..
-సంపూర్ణ పారిశుద్ధ్య గ్రామాలకు ప్రత్యేక నిధులు..
-మూడోరోజు గ్రామజ్యోతిలో ప్రజాప్రతినిధులు
సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించిన గ్రామాలకు ప్రత్యేక నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది అని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. గ్రామజ్యోతిలో మూడోరోజైన బుధవారం ఆయా గ్రామాల్లో ప్రజాప్రతినిధులు పర్యటించారు. సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులు, కమిటీలను ఆదేశించారు.

సమస్యలను పరిష్కరించుకోవాలి: గ్రామజ్యోతికి విశేష స్పందన వస్తున్నదని, ప్రతిఒక్కరూ భాగస్వాములై సమస్యలను గుర్తించాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక, జమ్మికుంట మండలాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

గ్రామాల్లో పర్యటించి సమస్యలపై అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఎమ్మెల్యే బోనోత్ మదన్‌లాల్ దత్తత తీసుకున్న తనికెళ్ల గ్రామంలో నిర్వహించిన గ్రామజ్యోతిలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామజ్యోతిని వెలిగించి బంగారు తెలంగాణకు బాటలు వేయాలని మంత్రి హరీశ్ మాట్లాడుతూ పిలుపునిచ్చారు. నాలుగేండ్లలో గ్రామజ్యోతి ద్వారా రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని,గ్రామంలో ఏ పనులు అవసరమో గ్రామస్తుల సమక్షంలోనే నిర్ణయించేందుకు గ్రామజ్యోతి దోహదపడుతుందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలం నాగారంలో అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పాల్గొని మాట్లాడారు. నాగారంను దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు.

Harish Rao participated in Grama Jyothi programme in Khammam district

గ్రామం కేంద్రంగా సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాలకే నిర్ణయాధికారాలు ఇచ్చిందన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలం దేశాయిపేట్, పోచారంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. గ్రామాల్లో కలియతిరిగి పారిశుద్ధ్య పనుల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా అటవీ శాఖ మంత్రి జోగు రామన్న జైనథ్ మండలం గూడ, తరోడ, నిరాల, సావాపూర్, బాలాపూర్ గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ప్రజలే గుర్తించి, వాటి పరిష్కారానికి చూపుకునేలా గ్రామజ్యోతి రూపొందించినట్లు చెప్పారు. గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి లక్ష్మణచాంద మండలం మల్లాపూర్, మామడ మండలం పొన్కల్‌లో పర్యటించారు.గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసమే గ్రామజ్యోతి కార్యక్రమమని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి భైంసాలో వ్యాఖ్యానిం చారు. గ్రామాలను అందంగా తీర్చిదిద్దేందుకే ఈ పథకాన్ని ప్రవేశపెట్టామని రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి చెప్పారు.

రంగారెడ్డి జిల్లా ధారూర్, పెద్దేముల్ మండలా ఆయన పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పాన్‌గల్‌లో భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాలానగర్ మండలం మల్లేపల్లిలో వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ సీ లకా్ష్మరెడ్డి, పెద్దమందడి మండలం దొడగుంటపల్లిలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి గ్రామజ్యోతిలో పాల్గొన్నా రు. మెదక్ మండలం రాజ్‌పల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా పెన్‌పహాడ్ మండలం చీదెళ్లలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. ఊరంతా ఒకటై మంత్రి జగదీశ్‌రెడ్డిని అనుసరిస్తూ శ్రమదానంలో పాల్గొన్నారు.

సర్వతోముఖాభివృద్ధికే  గ్రామజ్యోతి:మంత్రి కేటీఆర్
సిరిసిల్ల, గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన గ్రామజ్యోతి లో ప్రజలు భాగస్వాములు కావాలని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం రామన్నపల్లెలో గ్రామజ్యోతిలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పల్లెల సర్వతోముఖాభివృద్ధికే గ్రామజ్యోతి అని పేర్కొన్నారు.

KTR participated in Gramajyothi programme at ramannapalle of siricilla constituency

దేశంలో ఐదంచెల వ్యవస్థ ఉందని, కేంద్రస్థాయిలో కేంద్ర మంత్రివర్గం, రాష్ట్రస్థాయిలో రాష్ట్ర మంత్రివర్గం, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్, మండలంలో మండల పరిషత్, గ్రామస్థాయిలో గ్రామ సచివాలయాలు ఉన్నాయన్నారు. ఎవరి పనులు వారు చేస్తున్నారని, క్షేత్రస్థాయిలో గ్రామ సచివాలయం తన కర్తవ్యాన్ని నిర్వహించాలని సూచించారు. వివిధ మార్గాల ద్వారా వచ్చే నిధులను ఏవిధంగా ఖర్చు చేయాలో గ్రామసభలో ప్రజలే తీర్మానం చేసుకోవాలని చెప్పా రు. అన్ని గ్రామల్లో వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అక్షరాస్యత, పారిశుద్ధ్యం, మాతా శిశుమరణాల నివారణపై చర్యలు చేపట్టాల ని ఆదేశించారు. హరితహారానికి మొదటి ప్రాధా న్యం నివ్వాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, సీఈవో సూరజ్‌కుమార్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్షం కారణంగా మంత్రి కేటీఆర్ గంభీరావుపేట మండల పర్యటన రద్దయింది.