రెండు రోజుల కేరళ పర్యటనకి బయలుదేరిన పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్

• 6వ తేదిన కేంద్ర గ్రామీణాభివృధ్దిశాఖ జాతీయ ఉపాదిహమీ పధకం పై నిర్వహించే సదస్సులో పాల్గోననున్న మంత్రి
• 7వ తేదిన కేరళ గ్రామ పంచాయితీ వ్యవస్ధ క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్న మంత్రి

KTR

రెండు రోజుల కేరళ పర్యటనకి పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామరావు బయలుదేరారు. జనవరి 6వతేదిన కేంద్ర ప్రభత్వ గ్రామీణాబివృధ్ది ,పంచాయితీ రాజ్ శాఖ నిర్వహిస్తున్న ఓకరోజు ప్రాంతీయ గ్రామీణాబివృధ్ది శాఖ మంత్రుల సదస్సుకి హజరు కానున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురం దగ్గరలోని కోవలంలో జరగనున్న ఈ సదస్సుకి కేరళ,తమిళనాడు, కర్నాటక, అంద్రప్రదేశ్,తెలంగాణ,పుదుచ్చేరి,గోవా, మహరాష్ర్ట రాష్ర్టాలతోపాటు ఆండమాన్, నికోబార్,లక్ష్యద్వీప్ ప్రతినిధులు మంత్రులు పాల్గోంటారు. ఈ సదస్సులో జాతీయ ఉపాదిహమీ పథకం పై పూర్తి స్ధాయి సమీక్ష నిర్వహించడంతోపాటు, ఈపథకం పటిష్టం చేయడానికి చేపట్టల్సిన చర్యల గురించి చర్చిస్తారు. ఈసదస్సుకి కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి చౌదరి భీరేంద్ర నాద్ సింగ్,తో పాటు కేరళ ముఖ్యమంత్రి ఓమన్ చాందీ పాల్గోంటారు.
ఈసమావేశంలో వివిధ రాష్ర్టాలు ఉపాదిహమీలో సాదించిన విజయాలను, పనితీరు నమూనాల మీద చర్చించనున్నారు. ఉపాది హమీ పథకాన్ని కుదించవద్దంటూ తెలంగాణ అసెంబ్లీ చేసిన తీర్మానం, ఈ పథకం ద్వార తెలంగాణ జిల్లాల్లో జరిగిన ప్రగతిని, పలువిజయాలను మంత్రి కె. తారక రామా రావు సదస్సులో ప్రస్తావించనున్నారు. దీంతో పాటు సోషల్ అడిట్స్ మీద ఉమ్మడి అంద్రప్రదేశ్ చేసిన చట్టం మీద SSAAT,డైరెక్టర్ సౌమ్యకిందాంబి ప్రజేంటేషన్ ఇస్తారు. 7వతేదిన కేరళలోని పంచాయితీరాజ్ వ్యసస్ధను పరిశీన నిమిత్తం పంచాయితీల క్షేత్రపరిశీలన చేయనున్నారు.మంత్రితోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్, అర్ డి కమీషనర్ వేంకటేశ్వర్లు పర్యటనలో ఉన్నారు.