రాష్ట్రంలో బేలర్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్

గుండెవ్యాధుల చికిత్స సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత బేలర్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ముందుకొచ్చింది.

KCR with Belar Heart Representatives

బేలర్ ప్రతినిధులు డేవిడ్ బ్రౌన్, డాక్టర్ టెర్రిహీత్, జిమ్ రియల్లి తదితరులు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్న తమ నిర్ణయాన్ని బేలర్ ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి సంసిద్ధత వ్యక్తంచేశారు. దవాఖానా ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని వారికి సీఎం సూచించారు. రూ.600 కోట్ల పెట్టుబడితో పెట్టే ఈ సంస్థవల్ల వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.