రేడియోలో చేను కబుర్లు

-ప్రారంభించిన సీఎం

KCR
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా నిర్వహించే చేనుకబుర్లు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. సోమవారం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో రాష్ట్ర ప్రథమ ఉద్యానవన ప్రదర్శనను ప్రారంభించిన తర్వాత సీఎం ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చేను కబుర్లు కార్యక్రమంపై మధ్యాహ్నం 1.30 – 1.40 గంటల మధ్య సీఎం కేసీఆర్ సందేశం ప్రసారమైంది. ఇక నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 1.30 – 2 గంటల మధ్య పది నిమిషాల సేపు ప్రసారమవుతుంది. 15 నిమిషాలపాటు వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, మరో 15 నిమిషాలు గృహ విజ్ఞాన తరంగిణి కార్యక్రమం ప్రసారమవుతుంది. దీన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయ యూజీ, పీజీ విద్యార్థులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర రైతాంగానికి అవసరమైన సాంకేతిక సమాచారాన్ని సృజనాత్మక పద్దతుల్లో అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో విజ్ఞానం, ప్రసార నైపుణ్యం, ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు రైతుకు ప్రణాళికాబద్ధంగా సమయానుకూల సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఈ కార్యక్రమం తెలంగాణ మాండలిక భాషలో ప్రసారమవుతుంది.