ప్రజా సంక్షేమమే ప్రభుత్వ సంకల్పం

-నగర శివారుల్లోని చెరువులు, నాలాలను అభివృద్ధిచేస్తాం
-రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాల్లో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటన

Harish Rao

ప్రజా సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సంకల్పంతో ముందుకు వెళుతున్నదని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పీ మహేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), తీగల కృష్ణారెడ్డి (మహేశ్వరం) తదితరులతో కలిసి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం, సరూర్‌నగర్ మండలాల్లోని వివిధ గ్రామాల చెరువులు, నాలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో మూడు, నాలుగు నెలల్లో కృష్ణానదీ జలాల మూడోదశ పూర్తవుతుందన్నారు.
పైపులైన్ల ఆధారంగా నగరం చుట్టూ జలహారం (వాటర్ గ్రిడ్) ద్వారా తాగునీరు సరఫరాచేస్తామని తెలిపారు. మీర్‌పేట, జిల్లెలగూడ గ్రామాల పరిధిలోని మూడు చెరువులను మినీ ట్యాంక్‌బండ్‌లుగా తీర్చిదిద్దేందుకు ఎన్నికోైట్లెనా ఖర్చుచేస్తామని హరీశ్‌రావు చెప్పారు. పంచవటి సాయిలక్ష్మి కాలనీకి వెళ్లిన సందర్భంగా అక్కడ నివాసముంటున్న సినీనటుడు శివారెడ్డి ఇంటికి హరీశ్ ప్రభృతులు వెళ్లారు. రాష్ర్టావిర్భావం తర్వాత సినీ పరిశ్రమ పరిస్థితిపై ఆరాతీశారు. తెలంగాణ సినీ ఆర్టిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని మంత్రులను శివారెడ్డి కోరారు.