పరిశ్రమలకు అన్నివిధాలా సహకారం

-ఆదిభట్లలో పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే అవాంతరాలను తొలగిస్తామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. బుధవారం ఆయన టీఎస్‌ఐఐసీ ఈడీ నర్సింహారెడ్డితో కలిసి రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పారిశ్రామిక పార్క్‌ను సందర్శించారు. పార్క్‌లో ప్రాజెక్టు నిర్మిస్తున్న టాటా సంస్థ ప్రతినిధులు, ఇతర సంస్థల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే భూమి కేటాయింపుపై ఆయన వారితో చర్చించారు.

Jupally-Krishna-visit-adibatla-industrial park

ఆదిభట్ల పరిసర ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు నైపుణాభివృద్ధిలో శిక్షణనివ్వాలని పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. స్థానికులకు ఉపాధి అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధిలో శిక్షణపై టాటా గ్రూప్ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో ఏరోస్పేస్ ఉత్పత్తులకు పెట్టుబడులు పెట్టనున్న టాటా గ్రూప్.. వీటి ద్వారా వెయ్యిమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.