పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి

-టీఆర్‌ఎస్‌లో నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ చేరిక సందర్భంగా సీఎం కేసీఆర్

KCR

రైతు సంక్షేమం, వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు అనుకూల విధానాల పట్ల ఆకర్షితులైన నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గంగాధర్ తన అనుచరులతో కలిసి శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలోగానీ, మరే రాష్ట్రంలో అమలుగాని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు.

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకెళుతున్నదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, షకీల్ అహ్మద్, డీసీఎంఎస్ చైర్మన్ ముజీబ్, బోధన్ మున్సిపల్ చైర్మన్ ఎల్లయ్య, నాయకులు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.