నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటా:హరీష్‌రావు

తనను భారీ మెజారిటీతో గెలిపించిన సిద్ధిపేట నియోజక వర్గ ప్రజలకు రుణపడి ఉంటానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ వస్తదని ప్రజలు నమ్ముతున్నారని స్పష్టం చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో టీఆర్‌ఎస్ ముందుంటదని తెలిపారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకుంటామని హామినిచ్చారు.