Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నిరంతర విద్యుత్ సక్సెస్

-విద్యుత్ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక -ప్రత్యేక ఇంక్రిమెంట్.. ఈ నెల నుంచే అమలులోకి -రైతులకు 24గంటల కరంటు సరఫరా తెలంగాణ సాధించిన అద్భుతం -సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దిన ఘనత ఉద్యోగులదే.. -విప్లవాత్మక విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు -కరంటు కష్టాలకు శాశ్వత విముక్తి.. -ఇప్పటినుంచే రైతులు యాసంగి పంటలు వేసుకోవచ్చు -విద్యుత్ సంస్థల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం మరో రికార్డు సృష్టించింది. దేశంలో మొదటిసారిగా వ్యవసాయరంగానికి నిరంతర విద్యు త్‌ను ఉచితంగా అందించాలనే సంకల్పాన్ని సాకారం చేసుకుంది. నూతన సంవత్సరం తొలిరోజే రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు 24 గంటల విద్యుత్‌ను అందించే కార్యక్రమం దిగ్విజయమైంది. తెలంగాణ రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యా యి. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. యావత్ దేశమంతా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా విద్యుత్‌రంగంలో ఉద్యోగులు విప్లవాత్మక విజయాలు సాధించారన్నారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి అనుకున్న గడువు కంటే ముందుగానే రైతులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులు, ఉద్యోగులను అభినందించారు. తెలంగాణ రాష్ర్టానికి ఇంత గొప్ప ఖ్యాతిని సముపార్జించి పెట్టిన విద్యుత్ ఉద్యోగులకు అభినందనపూర్వకంగా జనవరి 2018 నుంచి వర్తించేలా ప్రత్యేక ఇంక్రిమెంటు ఇస్తున్నట్లు అధికారులు, ఉద్యోగుల హర్షధ్వానాల మధ్య సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజానీకమంతా విద్యుత్‌శాఖ పనితీరు పట్ల తృప్తిగా, ఆనందంగా ఉన్నదని సీఎం చెప్పారు. తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని.. నేడు అన్ని రంగాలకూ 24 గంటల నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసే విధంగా తీర్చిదిద్దిన ఘనత రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల ఉద్యోగులకే దక్కుతుందని ముఖ్యమంత్రి కితాబు ఇచ్చారు. రైతులకు 24 గంటలపాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందించడం మూడున్నరేండ్ల వయస్సున్న తెలంగాణ సాధించిన అద్భుత విజయమని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో సోమవారం ప్రగతిభవన్‌లో జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ డీ ప్రభాకర్‌రావుతోపాటు జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ప్రభాకర్‌రావును ఆలింగనం చేసుకుని అభినందించారు. విద్యుత్ సంస్థల డైరెక్టర్లు, సీనియర్ ఉద్యోగులను పేరు పేరునా పలుకరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యుత్‌శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రంలోని రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల నూతన సంవత్సర ఆనందాన్ని రెట్టింపు చేశారని పేర్కొన్నారు.

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడంతో.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందిస్తున్న రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతుంది. దశాబ్దాలపాటు రైతులు అనుభవించిన కరంటు కష్టాలకు శాశ్వత విముక్తి కలిగించాలనే లక్ష్యంతో వ్యయ ప్రయాసాలకోర్చి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందించాలని నిర్ణయించాం. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా రైతులకు 24 గంటల ఉచితవిద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వలేదు. మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా రైతులకు అత్యంత అవసరమని భావించి వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వాలని నిర్ణయించాం. 2018 ఫిబ్రవరి లేదా మార్చి నుంచి 24 గంటల సరఫరా చేయాలని మొదట భావించాం. కానీ అంతకన్నా ముందుగానే జనవరి 1 నుంచే యాసంగి పంటలు చేసుకునే విధంగా 24 గంటల సరఫరా ప్రారంభించడం సంతోషకరం. దేశంలో కొన్ని రాష్ర్టాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికీ, పరిమిత గంటల్లో మాత్రమే ఇస్తున్నాయి. మరికొన్ని రాష్ర్టాలు 24 గంటలు వ్యవసాయానికి ఇస్తున్నప్పటికీ చార్జీలు వసూలు చేస్తున్నాయి. 24 గంటలపాటు ఉచితంగా వ్యవసాయానికి కరంటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణతప్ప దేశంలో మరేదీ లేదు. ఇది తెలంగాణ రాష్ర్టానికి గర్వకారణం మాత్రమే కాదు, తెలంగాణ రైతులకు అత్యంత ఆవశ్యకమైన విషయం. నాకు ఉదయం చాలా రాష్ర్టాల నుంచి శుభాకాంక్షలు అందాయి. రైతుల సంక్షేమం కోసం తీసుకున్న గొప్ప నిర్ణయమని అభినందనలు తెలుపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. పక్కా ప్రణాళికతో, పకడ్బందీ కార్యాచరణతో ముందుకుపోవడం వల్లే ఈ విజయం సాధ్యమైంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. సోమవారం నాడు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో టీఎస్‌ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, జెన్‌కో డైరెక్టర్లు అశోక్‌కుమార్, వెంకటరాజం, లలిత్ కుమార్, టీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ కమాలుద్దీన్ అలీఖాన్, ట్రాన్స్‌కో డైరెక్టర్ జీ నర్సింగ్‌రావు, పీజీసీఐఎల్ ఈడీ వీ శేఖర్, జీఎం ఎస్ రవి తదితరులున్నారు.

ముఖ్యమంత్రికి సీఎండీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు విద్యుత్‌శాఖ ఉద్యోగులందరికీ ఒక ప్రత్యేక ఇంక్రిమెంటు ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు జెన్‌కో-ట్రాన్స్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకొన్న నిర్ణయం విద్యుత్‌శాఖ ఉద్యోగుల్లో మరింత ఆత్మైస్థెర్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ఉద్యోగులంతా రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని ప్రభాకర్‌రావు చెప్పారు. ముఖ్యమంత్రి దార్శనికత, మార్గదర్శకంలోనే విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిని మెరుగుపరుచగలిగాయని చెప్పారు.

సీఎం కేసీఆర్‌కు తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కృతజ్ఞతలు విద్యుత్ ఉద్యోగుల శ్రమను గుర్తించి ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులపక్షాన తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ జానయ్య కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో పనిచేసి రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయగలిగామని వివరించారు. సీఎం కేసీఆర్ తీసుకొన్న ఈ నిర్ణయం తమ సంస్థలోని ఉద్యోగులందరికీ మరింత ఆత్మైస్థెర్యాన్ని ఇచ్చిందని చెప్పారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా నిత్యం అప్రమత్తతతో పనిచేసి, దేశంలోనే మొదటిస్థానంలో నిలబెడుతామని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.