నేడు టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం

టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం నేడు తెలంగాణభవన్‌లో జరగనుంది. సమావేశంలో ఆపార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, తదితర నేతలు ఈ సమావేశంలో పాల్గొని తమ నేతను ఎన్నుకోనున్నారు. సమావేశానికి పార్టీ అభ్యర్థులు, నేతలు విధిగా హాజరుకావాలని కేసీఆర్ కోరారు.