నాణ్యమైన విద్యకు సహకరించండి

-బ్రిటన్ సాంస్కృతిక మంత్రిని కోరిన సీఎం

KCR with British Representatives
విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక, నాణ్యమైన విద్యను వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నామని, అందుకు సహకరించాలని బ్రిటన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి రాబ్‌లైన్స్, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్‌లను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కోరారు. గురువారం సచివాలయంలో సీఎంతో బ్రిటన్ మంత్రి, డిప్యూటీ హై కమిషనర్ భేటీ అయ్యారు. వచ్చే ఏడాది నుంచి విద్యా రంగంలో సమూల మార్పులు చేస్తామని, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యను అందించనున్నామని సీఎం కేసీఆర్ వారికి వివరించారు. బ్రిటన్‌లో మ్యూజియాల తరహాల సాలర్‌జంగ్ మ్యూజియాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు. ప్రముఖ కవి షేక్‌స్పియర్ ఇంటిని హెరిటేజ్ ప్రాపర్టీగా మార్చారడంపై సీఎం అభినందనలు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పరిశ్రమలశాఖ కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.