Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మెతుకుసీమలో భగీరథి

-ఇంటింటికి చేరుతున్న మంచినీళ్లు -ఉమ్మడి మెదక్ జిల్లాలో పూర్తి కావస్తున్న పనులు -ఈ నెల 10లోగా సిద్దిపేట జిల్లాలో ఇంటింటికీ సరఫరా -12న అధికారికంగా ప్రకటన చేయనున్న సర్కారు -14 కల్లా అన్ని గ్రామాలకూ బల్క్ వాటర్ సరఫరా -రెండురోజుల్లో సంగారెడ్డి జిల్లాలోనూ ప్రతి ఊరికీ బల్క్‌వాటర్ -ప్రయోగాత్మకంగా ముండ్రాయిలో 24 గంటల సరఫరా

ఆరోగ్య తెలంగాణ సాధనలో కీలకదశ పూర్తికావొచ్చింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన నీటిని అందించాలన్న లక్ష్యంతో భగీరథ యత్నాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కల త్వరలోనే సాకారం కానున్నది. యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్‌భగీరథ కార్యక్రమం దీపావళి నాటికి పరిపూర్ణం కానున్న నేపథ్యంలో పంద్రాగస్టు నాటికి అన్ని గ్రామాలకు బల్క్‌వాటర్ చేరనున్నది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాకు ఓవైపు గోదావరి.. మరోవైపు మంజీర జలాలు ఇంటింటికీ చేరనున్నాయి. ఈ క్రమంలో సిద్దిపేట జిల్లా పూర్తిస్థాయిలో ఇంటింటికీ నీళ్లు అందిస్తున్న తొలి జిల్లాగా చరిత్ర సృష్టించనున్నది. ఈ విషయాన్ని ఈ నెల 12న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతున్నది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో మిషన్ భగీరథపై నమస్తే తెలంగాణ అందిస్తున్న స్టేటస్ రిపోర్ట్… జోగన్నగారి మధుసూదన్‌రెడ్డి, సంగారెడ్డి/నమస్తే తెలంగాణ ప్రధానప్రతినిధి: ఉమ్మడి మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పనులు తుది దశకు చేరుకొన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈ నెల పదిలోగా పనులు పూర్తి చేసి ఇంటింటికీ నల్లా ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించిన జిల్లాగా సిద్దిపేట చరిత్ర సృష్టించనున్నది. ఆగస్టు 12న ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనున్నది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కూడా మిషన్ భగీరథ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆగస్టు 14 అర్ధరాత్రినుంచి అన్ని గ్రామాలకు భగీరథ జలాలు చేరాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలకూ బల్క్ వాటర్ సరఫరా అవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో ఒకటి రెండు రోజుల్లో బల్క్ వాటర్ సరఫరా అవుతుంది. ఉమ్మడి జిల్లాలో మిషన్ భగీరథ కోసం ప్రభుత్వం రూ.4185 కోట్లు వెచ్చిస్తున్నది. సంప్‌లు, ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రిడ్, ఇంట్రా విలేజ్ పైప్‌లైన్ల నిర్మాణాలు చివరి దశలో కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండలో ప్రధాని మోదీ 2016 ఆగస్టులో లాంఛనంగా భగీరథను ప్రారంభించిన విషయం తెలిసిందే.

రెండు జిల్లాలకు సింగూరు జలాలు మిషన్‌భగీరథ పథకంలో భాగంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సింగూరు జలాలను అందిస్తారు. ఇందుకోసం సింగూరు ప్రాజెక్టు వద్ద పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద 90 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ట్యాంకును, ఇన్‌టేక్‌వెల్‌ను నిర్మించారు. ఇదే మండలంలోని బుస్సారెడ్డిపల్లి వద్ద 100 ఎంఎల్‌డీ సామర్థ్యంలో మరో ట్యాంకు, ఇన్‌టేక్‌వెల్‌ను నిర్మించారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలతోపాటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు కూడా ఇక్కడి నుంచే నీరు సరఫరాచేసే విధంగా ఏర్పాట్లుచేశారు. సంగారెడ్డిలో 51 ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంప్‌లకు గాను 35 పూర్తయ్యాయి. మెదక్ జిల్లాలో 23 ట్యాంకులకు గాను 22 నిర్మాణం పూర్తిచేసుకొన్నాయి. మెదక్ జిల్లాలోని మొత్తం 959 ఆవాస గ్రామాలకు బల్క్ వాటర్ సరఫరా అవుతున్నది. సంగారెడ్డి జిల్లాలో 949 గ్రామాలుండగా 911 గ్రామాలకు బల్క్ వాటర్ వెళుతున్నది. మిగతా గ్రామాలకు రెండు రోజుల్లో భగీరథ నీరు వెళ్లనున్నది.

చిమ్నిబాయి బిడ్డ పెండ్లి చేసిన భగీరథ నీళ్లు భగీరథ నీళ్లు ఓమారుమూల తండాలో ఆడబిడ్డ పెండ్లిచేశాయి. చిమ్నిబాయిది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండలంలోని సర్దార్ తండా. ఖేడ్ ఉప ఎన్నికల సమయంలో మంత్రి హరీశ్‌రావు తండాకు వచ్చినప్పుడు తాగడానికి నీళ్లు లేవని చిమ్నీబాయి ఆవేదన వ్యక్తంచేసింది. నీళ్లు లేకపోవడంతో ఇక్కడి పిల్లలకు పెండ్లిళ్లు కావడంలేదని పేర్కొంది. ఆమె ఆవేదనకు చలించిన మంత్రి హరీశ్‌రావు తప్పకుండా తాగునీళ్లు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆయన హామీమేరకు ఇటీవలే సర్దార్ తండాకు తాగునీళ్లు వచ్చాయి. చిమ్నిబాయి ఇంటిముందు నల్లా కనెక్షన్ ఇచ్చారు. ఆమె ఆనందానికి అవధుల్లేవు. నా ఇంటికి నీళ్లొచ్చినయి.. నా బిడ్డ శ్వేత పెండ్లి చేస్తున్న అని హైదరాబాద్‌లో మంత్రి హరీశ్‌రావు ఇంటికి వెళ్లి పెండ్లి పత్రిక ఇచ్చివచ్చింది. పెండ్లి ఘనంగా జరిగింది. ఊరుకు ఎవరు వచ్చినా మాకు నీళ్లొచ్చినయ్ అని చిమ్నిబాయి సంతోషంగా చెప్పుకొంటున్నది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు చెప్తున్నది.

చరిత్ర సృష్టించనున్న సిద్దిపేట సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పనులు దాదాపుగా పూర్తికావచ్చాయి. జిల్లాలో రూ.1,200 కోట్లు ఖర్చు చేసి 2,234 కి.మీ ప్రధాన పైపులైన్, 2,747 కిలోమీటర్ల ఇంట్రా పైపులైన్లు వేశారు. 100 శాతం ఇంటింటికీ నల్లా ద్వారా తాగు నీరందిస్తున్న జిల్లాగా సిద్దిపేట చరిత్రలో నిలువనున్నది. ఈ విషయాన్ని ఈ నెల 12న అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకోసం సిద్దిపేటలోని కోమటిచెరువు వద్ద పైలాన్ నిర్మిస్తున్నారు. జిల్లాలో మొత్తం 760 ఆవాస గ్రామాలు ఉండగా అన్ని గ్రామాల్లో ఇంట్రా పైపులైన్ పూర్తి చేసి 2,15,508 గృహాలకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. సిద్దిపేట జిల్లాకు కరీంనగర్‌లోని దిగువ మానేరు డ్యాం నుంచి తాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం రాజీవ్ రహదారిపై కొండపాక, ప్రజ్ఞాపూర్ వద్ద రెండు చోట్ల హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పైపులైన్ నుంచి ఈ నీటిని తీసుకుంటున్నారు. నీటి సరఫరా కోసం కొండపాక, కొమురవెల్లి కమాన్, కోమటిబండ తదితర ప్రాంతాల్లో ఓహెచ్‌బీఆర్‌ఎస్ ట్యాంకులు, గ్రౌండ్‌లెవల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సంప్‌లను నిర్మించారు.

ముండ్రాయిలో 24 గంటల సరఫరా నంగునూరు మండలంలోని ముండ్రాయి గంగిరెద్దుల కాలనీలో మిషన్ భగీరథ పథకం కింద 24 గంటల నీటి సరఫరాను చేస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో అన్ని గ్రామాల్లో కూడా 24 గంటలపాటు నీటిని సరఫరా చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సరఫరాలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ఆయా మండలాల్లో మొబైల్ టీమ్‌లను ఏర్పాటుచేశారు.

ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ మిషన్‌భగీరథ పైపులైన్ల నిర్మాణంలో విషయంలో సీఎం కేసీఆర్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రం నుంచి మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ వెళ్లాల్సి ఉండగా.. అధికారుల ద్వారా తెలుసుకొన్న సీఎం తానే స్వయంగా దగ్గరుండి పొైక్లెనర్ తెప్పించి కాల్వ తీయించారు. పైప్‌లైన్ వేయడం ద్వారా కొంత పంట నష్టం అయినప్పటికీ ఈ పైప్‌లైన్ ద్వారా వరదరాజపూర్, కొత్తపేట, ఇటిక్యాలకు నీళ్లు వెళ్తాయని.. ఆయా గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులకు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా చాలా గ్రామాల్లో పైప్‌లైన్ల కోసం కాలువలు తీయడానికి చాలామంది ముందుకు వచ్చారు.

మంచినీళ్ల కష్టాలు తప్పాయి మిషన్‌భగీరథ పథకం ద్వారా మా ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చారు. గతంలో వీధి చివరన ఉన్న చేతిపంపు వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు ఇంటి ముందే నల్లాకు బిందెలో నీళ్లు పట్టుకుంటున్నాం. నల్లా చాల్‌జేస్తే కావాల్సినన్ని నీళ్లు బిందెలో నింపుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నారు. పొట్లచెరు రమ్య, రంగధాంపల్లి, సిద్దిపేట మండలం

కష్టం తెలిసిన సీఎం.. కేసీఆర్ గతంలో ఎండాకాలం వస్తే నీళ్లకోసం అరిగోస పడేటోళ్లం. సింగిల్ ఫేజ్ మోటర్ల చుట్టూ తిరిగే వాళ్లం. ఇప్పుడు వేస్తున్న ఒకే రకమైన పైపులతో అందరికి సమానంగా నీళ్లు వస్తున్నాయి. అందరి కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ సీఎం అయిండు కాబట్టే సమస్యలు తీరుతున్నయి. జనమ్మ, వెల్దుర్తి, మెదక్ జిల్లా

మహిళల బాధలు అర్థం చేసుకున్న సీఎం గతంలో నీళ్ల కోసం బోరుబావుల వద్దకు వెళ్లి నీళ్లు తీసుకురావాల్సి వచ్చేది. మా బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ నీటి కష్టాలు తీర్చెటెందుకుమిషన్ భగీరథతో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్నరు. మేమంతా రాష్ట ప్రభుత్వానికి రుణపడిఉంటాం. సునీత, హవేళిఘనపూర్, మెదక్ జిల్లా

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.