మే నెలలో డీఎస్సీకి చర్యలు..

వచ్చే మే నెలలో డీఎస్సీ పరీక్ష నిర్వహించే అవకాశముందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తెలిపారు.
-టెట్ అభ్యర్థులతో ముఖాముఖిలో ఐటీమంత్రి కేటీఆర్
-విద్యావ్యవస్థ పటిష్ఠతకే కడియంను మంత్రివర్గంలోకి తీసుకున్నారు
-వరంగల్‌లో పసునూరిని గెలిపించాలని వినతి

KTR addressing in a meeting with DSC aspirants

గురువారం హన్మకొండలో టెట్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులతో టీఆర్‌ఎస్వీ నాయకుడు సైదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ర్ట పరిపాలనకు అవసరమైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం సకాలంలో సమకూర్చకపోవడం వల్ల ఉద్యోగ నియామకాల్లో ఆలస్యమవుతున్నదని అన్నారు. 160 మంది సివిల్ సర్వీసెస్ అధికారుల అవసరముండగా మొదట 36 మందినే కేటాయించారని, ఏడునెలల క్రితం మిగతా అధికారులను ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే పనులు ముందుకు సాగుతున్నాయన్నారు.

Public

రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపర్చడానికి సీఎం కేసీఆర్ అనుభవజ్ఞులైన కడియం శ్రీహరిని పార్లమెంట్ నుంచి రాష్ట్ర క్యాబినెట్‌కు తీసుకొచ్చారని చెప్పారు. కడియం రాజీనామాతోనే ఉపఎన్నిక అనివార్యమైనందున, వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న పసునూరి దయాకర్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, శ్రీనివాస్‌గౌడ్, స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, శ్రీరాంశ్యాం, జెట్టి రాజేందర్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.