లక్ష్యాన్ని సాధిస్తే అదనపు నిధులు

గ్రామజ్యోతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను గ్రామాలు సాధిస్తే అదనపు నిధులు మంజూరు చేస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లిలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మన ఊరు-మన ఎమ్మెల్యే-మన సర్కార్ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో మరుగుదొడ్లు, అక్షరాస్యత, హరితహారం, మాతాశిశుమరణాల తగ్గింపు, పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేస్తే అదనపు నిధులు మంజూరు చేస్తామన్నారు.

KTR visit to Nagarkurnool

-గ్రామజ్యోతిలో నిర్దేశించిన ఉద్దేశాలను విజయవంతం చేయాలి
-రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్షాలది మొసలి కన్నీరు: మంత్రి కేటీఆర్
-నాగర్‌కర్నూల్‌లో మన ఊరు-మన ఎమ్మెల్యే-మన సర్కార్
సంక్షేమరంగానికి రూ.28వేల కోట్ల కేటాయింపుతో దేశంలోనే రాష్ట్రం తొలిస్థానంలో ఉన్నదన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు మొసలికన్నీరు కారుస్తున్నాయని, ఆ పాపం ఆరవై ఏండ్లు పాలించిన కాంగ్రెస్, టీడీపీలదేనన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, మాజీ ఎంపీ మంద జగన్నాథ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ పాల్గొన్నారు.