కులవృత్తులకు పూర్వవైభవం తెస్తాం:గౌడ ఐక్య సాధన సమితి నేతలతో కేసీఆర్

తెలంగాణలో గీత వృత్తిని పరిరక్షించి కల్లుగీతకు పూర్వవైభవం తెస్తానని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం తెలంగాణ గౌడ ఐక్య సాధన సమితి, తెలంగాణ కల్లు దుకాణాల సాధనా సమితి చైర్మన్ అంబాల నారాయణగౌడ్, తెలంగాణ గౌడ జేఏసీ కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతినిధులు కేసీఆర్‌ను కలిసి కల్లుగీత సమస్యలను వివరించారు. హైదరాబాద్‌లో మూతపడిన కల్లుదుకాణాలను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.