కేసీఆర్ పాలనలోనే బడుగులకు న్యాయం

-సైదాబాద్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు
-మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
-పాల్గొన్న ఎంపీ బూర నర్సయ్యగౌడ్

Harish-Rao-election-campaign-at-Saidabad

నగరంలోని ప్రతిసమస్యను తమసమస్యగా భావించి పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగుడులు వేస్తున్నదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హారీశ్‌రావు అన్నారు. కేసీఆర్ పాలనలోనే బడుగులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ దీర్ఘకాలిక ఆలోచనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కృష్ణా జలాలు తగ్గిపోవడం, మంజీరతోపాటు నగరానికి నీటిని అందించే జంట జలాశయాలు ఎండిపోవడంతో నగరవాసులకు మంచినీటి ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు.

ఈ పరిస్థితిని ముందే గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను నగరానికి తీసుకువచ్చి ప్రజల దాహార్తిని తీర్చిందని చెప్పారు. నగర జనాభా అవసరాలు తీర్చేవిధంగా శివారు ప్రాంతాల్లో జలాశయాలను నిర్మిస్తున్నామని చెప్పారు. రూ.7,500కోట్ల వ్యయంతో కేశవపురం, రాచకోండ ప్రాంతాల్లో తాగునీరు నిల్వ కోసం 40 టీఎంసీల సామర్థ్యం కలిగిన జలాశయాలను ఏర్పాటకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని మంత్రి చెప్పారు. ముంబాయి నగరం మాదిరిగా హైదరాబాద్‌లో కనురెప్పపాటు కరెంటు పోకుండా ఉండేందుకు విద్యుత్ వలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.

సైదాబాద్ డివిజన్‌ను దత్తత తీసుకుని ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. సైదాబాద్ డివిజన్‌లోని ఎర్రగుంట హిందూ శ్మశానవాటికను జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం తరహాలో రూపొందిస్తామని, సమీపంలోని చెరువును సుందరీకరణ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి సింగిరెడ్డి స్వర్ణలత, సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇంచార్జి చవ్వా సతీష్‌కుమార్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్‌ఎస్ పార్టీ కో-ఆర్టినేటర్ ఆజంఅలీ, అక్బర్‌బాగ్ డివిజన్ అభ్యర్థి తేళ్ల మహేష్ కుమార్, టీఆర్‌ఎస్ నేతలు బాలకృష్ణగౌడ్, లింగాల హరిగౌడ్, బొడిగె వినోద్‌కుమార్, కే భూమేశ్వర్, మాజీ కార్పోరేటర్ రమేష్ ముదిరాజ్, కాలనీ సంక్షేమ సంఘం కార్యదర్శులు వైఎన్‌మూర్తి, రామకృష్ణయ్య, పద్మారావు, శ్రీనివాస్, రాజపతి ముదిరాజ్, వనం జగదీశ్వర్, మట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు ఉంటుందంటూ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఓ తీర్మానాన్ని ఆమోదించారు