Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

కేసీఆర్ గారూ.. మా సదస్సుకు రండి!

-వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి ఆహ్వానం -న్యూ చాంపియన్స్ -2015లో పాల్గొనాలని లేఖ -చైనాలో సెప్టెంబర్ 9 నుంచి11 వరకు నిర్వహణ -అభివృద్ధి అనుభవాలు పంచుకోవాలని సూచన

KCR 01

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు వరల్డ్ ఎకనామిక్ పోరం నుంచి ఆహ్వానం అందింది. చైనాలో సెప్టెంబర్ 9 నుంచి 11 వరకు జరిగే న్యూ చాంపియన్స్ -2015 సదస్సులో పాల్గొనాలని ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ ఫిలిప్ రోస్లర్ సీఎంను కోరారు. ఈ మేరకు రోస్లర్ రాసిన లేఖ శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. వేగంగా పురోగమిస్తున్న సమాజంలో భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా 2015 సంవత్సరంలో తమ ప్రతిభాపాటవాలతో అద్భుత ఫలితాలు సాధించిన ప్రగతి సాధకులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. వీరిలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బహుళ జాతి సంస్థలు, ప్రభుత్వాలు, మీడియా, విద్యాసంస్థలు, పౌర సమాజాలకు చెందిన 1500 మంది ప్రముఖులు, ప్రతినిధులున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా నూతన ఆవిష్కరణలు, సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి అంశాలపై చర్చ జరుగుతుంది.

తెలంగాణ అనుభవాలు పంచుకోండి.. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టాన్ని అద్వితీయంగా అభివృద్ధివైపు పరుగులెత్తిస్తున్న సీఎం తన పని విధానానికి సంబంధించిన అభిప్రాయాలను పంచుకోవడం సదస్సుకు గొప్ప విలువను తెచ్చిపెడుతుందని కేసీఆర్‌కు రాసిన లేఖలో ఫిలిప్ రోస్లర్ పేర్కొన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణీకరణ, నూతన ఆవిష్కరణలతో కూడిన అభివృద్ధి తదితర అంశాల్లో జరిగే చర్చలో కేసీఆర్ అభిప్రాయాలు ఆవశ్యకమని తాము అభిప్రాయపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనవెంట వ్యాపార ప్రతినిధి బృందాన్నికూడా తీసుకురావచ్చునని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థకు ప్రభుత్వ-ప్రైవేట్ సహకారంతో నడిచే అంతర్జాతీయ సంస్థగా గుర్తింపు లభించిందని, సదస్సు సందర్భంగా ఉన్నత స్థాయిలో జరిగే చర్చలు సాంకేతిక పరిజ్ఞానం, నూతన అవిష్కరణలు ఆర్థిక సుస్థిరతకు దోహదపడే విధంగా ఉంటాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.

తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు.. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచంలోని పలు దేశాలను ఆకర్షిస్తున్నాయి. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినప్పటికీ.. విధానాల రూపకల్పనలో వినూత్న పంథాను అనుసరించడంతో ప్రపంచం తెలంగాణ వైపు ఆసక్తిగా చూసే పరిస్థితి వచ్చింది. మానవీయ కోణంలో సంక్షేమం, పక్కా ప్రణాళికలతో అభివృద్ధి, భావితరాలకు సైతం ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టులు చేపడుతూ ప్రభుత్వం పాలనలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నది. ఇదే అంతర్జాతీయ గుర్తింపునకు కారణమైంది. ఫలితంగానే ఈ అనుభవాలు పంచుకోవాలంటూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానించింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.