కేసీఆర్ మంత్రివర్గం

తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 11 మంది టీఆర్‌ఎస్ నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. వీరందరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. కేసీఆర్ మంత్రివర్గం….

1. మహముద్ అలీ (ఎమ్మెల్సీ)

Mahamud Ali

1953, మార్చి 2న జన్మించారు. విద్యార్హత : బి. కామ్. 2013లో టీఆర్‌ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సభ్యుడు, మైనార్టీ విభాగంఅధ్యక్షుడిగా బాధ్యతలు.

2. డా. తాటికొండ రాజయ్య (స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే)

Tatikonda Rajaiah

1965, జూలై 12న జన్మించారు. స్వస్థలం – వరంగల్ జిల్లా తాటికొండ. విద్యార్హత – ఎంబీబీఎస్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.

3. నాయిని నర్సింహారెడ్డి

Naini Narsimha Reddy

జననం : 1940, మే 12. స్వస్థలం : దేవరకొండ మండలం నేరేడుగొమ్ము(నల్లగొండ జిల్లా). విద్యార్హత : హెచ్‌ఎస్‌సీ. 1978, 1985, 2004 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది.

4. ఈటెల రాజేందర్ (హుజురాబాద్ ఎమ్మెల్యే)

Etela Rajendar

జననం : 1964, మార్చి 20. విద్యార్హత : బీఎస్సీ, హుజురాబాద్ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక. 2004, 2008, 2009, 2010, 2014 ఎన్నికల్లో విజయం. ఏడేళ్ల పాటు టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా పని చేశారు.

5. పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బాన్సువాడ ఎమ్మెల్యే)

Pocharam Srinivas Reddy

1949, ఫిబ్రవరి 10న జన్మించారు. విద్యార్హత – బీఈ. 1994, 1999, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు కీలక శాఖల్లో పని చేసిన అనుభవం ఉంది.

6. తన్నీరు హరీష్‌రావు (సిద్దిపేట ఎమ్మెల్యే)

Harish Rao

జననం : 1972, జూన్ 3. స్వస్థలం : కరీంనగర్ జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి. 2004, 2008, 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం. టీఆర్‌ఎస్‌లో కీలక నేతగా పని చేశారు.

7. పద్మారావు (సికింద్రాబాద్ ఎమ్మెల్యే)

Padma Rao

రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

8. పట్నం మహేందర్‌రెడ్డి (తాండూరు ఎమ్మెల్యే)

Patnam Mahendar Reddy

నాలుగో సారి ఎమ్మెల్యేగా విజయం.

9. కె. తారకరామారావు (సిరిసిల్ల ఎమ్మెల్యే)

KT Ramarao

జననం : 1976, జూలై 26.
స్వస్థలం : మెదక్ జిల్లా చింతమడక. విద్యార్హత : ఎమ్మెస్సీ, ఎంబీఏ. 2009, 2010, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు. అమెరికాలో ఉద్యోగం వదిలి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు.

10. జోగు రామన్న (ఆదిలాబాద్ ఎమ్మెల్యే)

Jogu Ramanna

1963, జులై 4న జన్మించారు. స్వస్థలం : జైనథ్ మండలం దీపాయిగూడ. విద్యార్హత : ఇంటర్మీడియట్, 2009, 2011, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం.

11. జగదీష్‌రెడ్డి (సూర్యాపేట ఎమ్మెల్యే)

Jagadeeshwar Reddy

జననం : 1965, జులై 18. స్వస్థలం : అర్వపల్లి మండలం నాగారం. విద్యార్హత : ఎల్‌ఎల్‌బీ, 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు.