ఇంటి పార్టీకి జనం మద్దతు

టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇంటిపార్టీ వెంటే ఉంటామంటూ స్వచ్ఛందంగా ముందుకువచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కే తారకరామారావు పాల్గొని పార్టీ సభ్యత్వాలు అందజేశారు.

నిర్మల్‌లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ వేణుగోపాలాచారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డ్ది, పెద్దపల్లి జిల్లా ధర్మారంలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, సెస్ చైర్మన్ లకా్ష్మరెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో మంత్రి అజ్మీరా చందూలాల్, మేడ్చల్ జిల్లా దూలపల్లిలో ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యే వివేకానంద్, సంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, గూడెం మహీపాల్‌రెడ్డి,

సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి,మండలి విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, అంజయ్యయాదవ్, కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు ఎస్ రాజేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, వనపర్తి జిల్లాలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మెహిదీపట్నంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, హన్మంత్‌షిండే, నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, నలమోతు భాస్కర్‌రావు పార్టీ సభ్యత్వాలు అందించారు. మంచిర్యాలలో ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యే దివాకర్‌రావు అంగన్‌వాడీలను పార్టీలోకి ఆహ్వానించి పార్టీ సభ్యత్వాలు అందజేశారు.