
-నేటితో ముగియనుండటంతో నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు
-రోడ్‌షోలు, సభలతో గ్రామాలను చుట్టివస్తున్న గులాబీ అభ్యర్థులు
-విస్తృత ప్రచారాలతో హోరెత్తుతున్న పల్లెలు,పట్టణాలు
-టీఆర్ఎస్కు ఓటేసి, అండగా ఉంటామంటున్న ప్రజలు
ఎన్నికల ప్రచారం ముగియడానికి కొన్ని గంటలే సమయం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చే స్తూ గ్రామాలన్నింటినీ మరోసారి చుట్టివస్తున్నారు. రోడ్‌షోలు, సభలతో హోరెత్తిస్తున్నారు. నాలుగున్నరేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రజలు సైతం టీఆర్ఎస్కే ఓటేసి అండగా ఉంటామని, సీఎం కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని అంటున్నారు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న సీఎం కేసీఆర్‌ను ఓడించే శక్తి ప్రజాకూటమికి లేదని కొల్లాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లపల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పొరపాటున కూటమి అధికారంలోకి వస్తే త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ తిరిగి అంధకారంలోకి వెళుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాకూటమి నాయకులు చెప్పే మాటలు నమ్మొద్దని ఆదిలాబాద్ అభ్యర్థి, మంత్రి జోగు రా మన్న అన్నారు.
జైనథ్ మండలం గిమ్మ, భోరజ్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి.. మోసాలకు పాల్పడే కూటమి నాయకులకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు అభ్యర్థి, మంత్రి చందూలాల్ ములుగు మండలం మదనపల్లిలో ప్రచారం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను నట్టేటా ముంచేందుకు గ్రామాల్లోకి వస్తున్న మహాకూటమి.. దుష్టపన్నాగాల కూటమి అన్నారు. టీఆర్ఎస్ పాలనలో అన్నివర్గాలకు న్యాయం జరిగిందని, గులాబీ పార్టీని ఆదరించాలని కోరారు.
పథకాలను చూడండి.. ఓటేయండి..

నాలుగున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని జడ్చర్ల అభ్యర్థి, మంత్రి లకా్ష్మరెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ఇందిరానగర్ కాలనీ, మిడ్జిల్ మండలం బోయిన్పల్లితోపాటు పలు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నివర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ కృషి చేసిందన్నారు. బాన్సువాడ అభ్యర్థి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు కట్టించి ఇస్తామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నా రు. మహాకూటమి కుట్రలను ప్రజలు తిప్పికొట్టాల ని నిర్మల్ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. నిర్మల్‌లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేసిందన్నారు. ప్రజాకూటమిని ఓటుతో ఆంధ్రా అంచులకు తరిమికొట్టాలని సూచించారు.
సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంతో పాటు, పెద్దంపల్లి, రావులపల్లె, గడిపల్లె, భాగిర్థిపేట తదితర గ్రామాల్లో భూపాలపల్లి అ భ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని అభ్యర్థించా రు. వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్ పలు డివిజన్లలో ప్రచారం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో చొప్పదండి అభ్యర్థి సుంకె రవిశంకర్, ఎంపీ వినోద్‌కుమార్ ఇంటింటా ప్రచారం చేశారు. కరీంనగర్లో గంగుల కమలాకర్, మానకొండూర్ అభ్యర్థి రసమయి బాలకిషన్ గన్నేరువరంలో ప్రచారం చేశారు. వనపర్తి టీఆర్ఎస్ అభ్యర్థి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మండలంలోని చందాపూర్, దత్తాయిపల్లి, అంజనగిరి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ హయాం లో చేసిన అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలన్నారు.
మైనార్టీలకు అధిక ప్రాధాన్యం: మహమూద్‌అలీ

టీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చిందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, హైదరాబాద్‌లో జరిగిన సమావేశాల్లో మాట్లాడుతూ.. దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మైనార్టీల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, నాలుగున్నరేండ్ల టీఆర్ఎస్ సర్కార్ అన్నివిధాలా ఆదుకున్నదన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలిపారు. దేశంలో ముస్లింను డిప్యూటీ సీఎం చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్సేనని, ఏకైక నాయకుడు కేసీఆరేనని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం అనేవి సీఎం కేసీఆర్‌కు రెండుకండ్ల వంటివని తెలిపారు. సైద్ధాంతిక విభేదాలున్న కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకోవడం రాజకీయ వ్యభిచారమని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవాచేశారు.
ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో..
ఖమ్మం జిల్లా పాలేరు అభ్యర్థి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఖమ్మంరూరల్ మండలంలో ప్రచా రం చేశారు. మధిర అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఇల్లెందులపాడు, ముదిగొండ మండలంలో రోడ్‌షో చేపట్టారు. సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవి వేంసూరు మండలంలో, వైరా అభ్యర్థి మదన్‌లాల్ ఏన్కూరు మండలంలో ప్రచారం చేశారు. కొత్తగూడెం అభ్యర్థి జలగం వెంకట్రావ్ పాల్వంచలో, ఇల్లెందు అభ్యర్థి కోరం కనకయ్య పట్టణంలో, పినపాక అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో ప్ర చారం చేశారు. నల్లగొండ టీఆర్ఎస్ అభ్యర్థి భూ పాల్‌రెడ్డి జిల్లా కేంద్రంలో, దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్ గొట్టిముక్కలలో, సాగర్ అభ్యర్థి నర్సింహయ్య తిరుమలగిరి, సాగర్, అనుముల మండలాల్లో, మునుగోడు అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి సంస్థాన్‌నారాయణపురం మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు.
ద్రోహులతో పొత్తెందుకు సారూ: కడియం

వరంగల్ రూరల్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ఐనవోలు: తెలంగాణ ద్రోహులతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సార్ చెప్పాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలంతా కలిసి ద్రోహులను ఆంధ్రాకు తరిమికొడితే కాంగ్రెస్, టీజేఎస్ నేతలు సిగ్గులేకుండా తమ భుజాలపై ఎందుకు మోసుకొస్తున్నారో సమాధానం చెప్పాలన్నా రు. మంగళవారం వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల్లోని ఐనవోలు, పర్వతగిరిలో వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్‌తో కలిసి నిర్వహించిన రోడ్‌షోల్లో కడియం మాట్లాడుతూ ఉద్యమ కాలంలో జేఏసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు జేఏసీ నుంచి టీడీపీ, కాంగ్రెస్‌లను బహిష్కరించిన విషయం మర్చిపోయారా? అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలతో పొత్తు వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో కోదండరాం బహిర్గతం చేయాలని సూచించారు.

వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే: హోంమంత్రి నాయిని
రాంనగర్: గులాబీ పార్టీని ఓడించే మొనగాడే లేడని, వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ముషీరాబాద్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు మద్దతుగా రాంనగర్ రిసాల బస్తీలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో నిరంతర విద్యుత్ ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆ పార్టీకి ఒక్కసీటు కూడా రాదని జోస్యం చెప్పారు. సర్వేలన్నీ టీఆర్ఎస్కు అనుకూలంగా వస్తుండటంతో ప్రతిపక్షాలకు భయం పట్టుకున్నదని ఎద్దేవా చేశారు. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడిని జగన్ అడ్రస్ లేకుండా చేస్తుండటంతో బాబు తెలంగాణవైపు దృష్టి సారించారని ఎద్దేవా చేశారు. బాబు ఆటలు ఇక్కడ సాగబోవని, టీఆర్ఎస్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఈనెల 15న కేసీఆర్ సీఎంగా రెండోసారి ప్రమాణం చేయడం ఖాయమన్నారు.
అది ప్రజా వ్యతిరేక కూటమి: ఎంపీ వినోద్‌కుమార్
సిరిసిల్ల టౌన్/ముస్తాబాద్/బోయినపల్లి: కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌ల కూటమి ప్రజా వ్యతిరేక కూటమి అని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల ఆశీర్వాదాలై వంద స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాకూటమికి, బీజేపీకి ఘోర పరాజయం తప్పదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో, మీడియాతో మాట్లాడుతూ.. బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకురాలు, సినీనటి కుష్బూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఉరిసిల్లను సిరిసిల్లగా మార్చారని కొనియాడారు. రాహుల్‌గాంధీకి తెలంగాణ స్థితిగతులపై ఏ మాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు సూచించారు.