గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలు

-రోడ్ల నాణ్యత తగ్గితే కాంట్రాక్టర్లు, అదికారుల పై కఠిన చర్యలు
– కాంట్రాక్ట్ ల గడువు పొడగింపు ఏట్టి పరిస్ధితుల్లోనూ ఉండదు
– నీర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకుంటే జరిమానాలు తప్పవు

KTR review on Panchayat Raj Roads

గ్రామీణ రహదారులు ప్రగతికి చిహ్నలని పంచాయితీరాజ్ శాఖా మంత్రి కె. తారక రామారావు అన్నారు. గ్రామీణా ప్రాంతాలు పట్టణాలతో  సమానంగా అబివృధ్ది చేందాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని అందుకే గ్రామీణ ప్రాంత రహదారులకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఏన్నడు లేని విధంగా అత్యంత ప్రాధాన్యత అంశంగా పరిగణించి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నిధుల కేటాయింపే కాకుండా పనుల అప్రూవల్స్ సైతం ఒక పద్దతి ప్రకారం చేశామని, అన్ని నియోజకవర్గాలకి సమాన ప్రాధాన్యతను, స్దానిక అవసరాలను బట్టి ఇచ్చామని మంత్రి తెలిపారు. మెత్తం రాష్ర్టంలోని బిటి రోడ్లను బలోపేతం చేసేందుకు ఐదు సంవత్సరాల ప్రణాళిక తమ వద్ద ఉందని మంత్రి తెలిపారు. ఇందులో బాగంగా మెదటి ఏడాది 12006 కీలో మీటర్ల బిటి రోడ్ల రెనెవల్స్ ను మంజూరు చేస్తూ జీవో ఇచ్చామని మంత్రి తెలియజేశారు. ఈ రోజు పంచాయితీరాజ్ ఇంజనీర్ ఇన్ ఛీప్ సమావేశమైన మంత్రి రోడ్ల పనుల తాలుకు కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పంచాయితీ రాజ్ శాఖ తరపున నిన్న జరిగిన క్లాస్ 1మరియు స్పేషల్ క్లాస్ కాంట్రాక్టర్ల సమావేశం తాలుకు నివేదికను ఈఏన్ సి సత్యనారాయణ మంత్రికి అందజేశారు. పంచాయితీ రాజ్ రోడ్లతో ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టవీటి అందేలా చూడాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం నాణ్యమైన రోడ్లను వేసేందుకు చర్యలు తీసుకుంటున్నమని మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా కాంట్రాక్టర్లకి బిల్లుల చెల్లింపులు ఏలాంటి అలస్యం ఉండదని, నిదుల కోరత సైతం రాకుండా చూస్తామని, అయితే నాణ్యత విషయంలో చాల కఠినంగా ఉంటామని తెల్పారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, గడువు పెంచే ప్రసక్తే ఉండదని మంత్రి తెల్చి చేప్పారు. గతంలో మాదిరి కాంట్రాక్టులకి గడువు పెంచే ఫైళ్లని ఏమాత్రం అనుమతించేది లేదని ఇందుకోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఈఏన్సీ కి తెలిపారు. గడువులోపల పనులు పూర్తి చేయకుంటే ఖచ్చితంగా జరిమానాలు వసూలు చేస్తామని మంత్రి హెచ్చరించారు. పియంజీఏస్వై ప్రమానాలతో రోడ్లు వేయడంతో పాటు వచ్చే ఇదు సంవత్సరాల పాటు డిపెక్ట్ లయబులీటీ పిరియడ్ ఉంటుందని, దీని భాద్యత కాంట్రక్టర్లదే అని తెలిపారు. కాంట్రాక్టర్లు సభ్ కాంట్రాక్టులు ఇచ్చి చేతులు దులుపుకునే పద్దతి స్వస్తి పలికేలా చూడాలని ఈఏన్సిని కోరారు. కాంట్రాక్టర్లు అవాంచిత పోటీకి తెర తీయకుండా చూడాలని, ఓకవేళ నాణ్యతలో లోపాలుంటే అదికారుల పైన శాఖా పరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని తెలిపారు. పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ సిబ్బందికి ప్రభుత్వ లక్ష్యం అర్ధం అయ్యేలా మార్గ దర్శనం చేయాలని ఈ ఏన్ సి ని కోరారు. మెత్తం 70 కాంట్రాక్టర్లు నిన్నటి మీటింగ్ హజరయ్యారని, వారు తెలిపిన పలు ప్రతిపాదనలతో కూడిన నివేదికను మంత్రి ఈ ఏన్ సీ అందించారు.