ఎంత ఎదిగినా ఒదిగి ఉంటాం

గడిచిన సాధారణ ఎన్నికలతో పోల్చితే టీఆర్‌ఎస్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. బంగారు తెలంగాణ దిశగా రాష్ర్టాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలుస్తున్నారు. దేశంలో ఏ ప్రభుత్వం తీసుకోని నిర్ణయాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తూ
-మెజారిటీ పెరిగింది…అహంకారం పెరగలేదు
-ఇకపై వచ్చే అన్ని ఎన్నికల్లో వరంగల్ తీర్పే పునరావృతం
-గత ప్రభుత్వాల పాపాలను టీఆర్‌ఎస్ సర్కార్ కడుగుతున్నది
-వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Pocharam-Srinivas-Reddy-featured-image

ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్నది. సీఎం కేసీఆర్ పాలనపట్ల ప్రజల్లో విశ్వాసం ఉందనడానికి వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ఫలితమే నిదర్శనం. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదు. డిపాజిట్ కూడా రాకుండా బండకేసి కొట్టారు. రాష్ట్ర చరిత్రలో అత్యధిక మెజారిటీ పసునూరి దయాకర్‌కు వచ్చింది. మా ప్రభుత్వానికి ప్రజల మద్దతు, మెజారిటీ పెరిగింది. కానీ అహంకారం పెరగలేదు. ఫలితాన్ని చూసి ఉబ్బిపోతలేం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటూ ప్రజాసేవకు పునరంకితమవుతాంఅని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వరంగల్ ఉపఎన్నిక ఫలితమే పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రూ.9,500 కోట్లు ఖర్చుచేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత- చేవెళ్ల ద్వారా ఒక్క ఎకరానికీ నీరివ్వలేదన్నారు. ప్రజాప్రతినిధులు, కాంటాక్టర్ల జేబులు నింపడానికే ఆ నిధులు ఉపయోగపడ్డాయని ఆరోపించారు. గత పాలకులు చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని కడుగుతున్నదన్నారు. రూ.35 వేల కోట్లతో కాళేశ్వరం, రూ.32,500 కోట్లతో పాలమూరు-రంగారెడ్డి, రూ. 6,100 కోట్లతో డిండి ప్రాజెక్టులకు అద్భుతమైన ప్రణాళికను ప్రభుత్వం రూపొందించిందన్నారు. ప్రభుత్వం ఉత్పత్తి చేయబోయే 25 వేల మెగావాట్ల విద్యుత్ నుంచి 3,500 మెగావాట్ల విద్యుత్‌ను అన్ని ఎత్తిపోతల పథకాలకు కేటాయిస్తామని చెప్పారు.

తక్షణమే కేంద్ర బృందాన్ని రాష్ర్టానికి పంపించాలని, కరువు నివారణకు ఆర్థిక సాయం ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. నీటి లభ్యత తక్కువగా ఉన్నందున ఆరుతడి పం టలు సాగుచేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. గతంలో 33 శాతం ఉన్న ఆరుత డి విత్తనాల సబ్సిడీని 50 శాతానికి పెంచి ప్రోత్సహిస్తున్నామన్నారు. నీటిలభ్యత ఉన్నచోట రైతులు వరిసాగు చేసినా అభ్యంతరం లేదన్నారు. ఎవరిపైనా కేసులు నమోదుచేయబోమని, మోటార్లు తొలగించబోమని స్పష్టంచేశారు.