దిల్‌ఖుష్ దోస్తానా

మందమర్రి ఎమ్.ఎల్.ఎ నల్లాల ఓదెలు కాలేజ్ డేస్
గురించి చెప్పమంటే..
నేను ఇప్పటికీ యువకుడినే, కొత్తదనం కోరుకునే ప్రతి ఒక్కరూ యూతే అని చమత్కరిస్తూ మొదలెట్టారు.

Nallala-Odleu-05

మా నాన్న పేరు రాజం, అమ్మ పోశక్క. నేను చదివింది మొత్తం గవర్నమెంట్ కాలేజిల్నే. ఎన్ని వ్యాపకాలున్నా రెగ్యులర్‌గా కాలేజీకి వెళ్లేవాణ్ణి. చదువులో మాత్రం యావరేజ్ స్టూండెంట్‌నే. నేను నా ఎనిమిదవ తరగతినుంచే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్(పి.డి.యస్)లో మెంబర్‌ను. అప్పటి నుంచే నేను మా గ్యాంగ్‌తో కలిసి హాస్టల్‌లో ఫెసిలిటీస్ కోసం పోరాడేటోణ్ణి. ఆటలంటే చాలా ఇష్టంగా ఉండేది. కబడ్డీ, క్రికెట్ బాగా ఆడేవాళ్లం. రన్నింగ్ రేస్ పెడితే ప్రైజ్ నాదే.

చాలా ప్రైజులొచ్చాయి బడికి పోదాం మామ..
కాలేజ్ డేస్‌లో మేం ఆటలు ఒక్కటే కాదు కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా చేస్తుండేది. నేను నా ఫ్రెండ్స్ కలిసి, ప్రజల్లో చదువు పట్ల చైతన్యం కలిగించడం కోసం బడికి పోదాం మామ, మనం చదువుకుందాం.. అక్షర దీప్తి వంటి నాటకాలు వెసేటోళ్లం. నేను డిగ్రీ మంచిర్యాల గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న. సైన్స్ కాలేజీ సెక్రెటరీగా పనిచేసిన. సైన్స్ టూర్లకు వెళ్లి చేసిన ఎంజాయ్ ఇప్పటికీ మర్చిపోలేను.

సామాజిక కార్యక్రమాలు..
ఆ తర్వాత కొన్ని నెలలు పత్రికా విలేకరిగా పనిచేసిన. మేం రిపోర్ట్ చేసిన కవర్స్‌ను చేతిలో పట్టుకొని నైట్ హైదరాబాద్ బస్సు కోసం వెయిట్ చేసేవాళ్లం. మేం రాసిన వార్తలు రెండు రోజుల తర్వాత పేపర్‌లో వచ్చేది. ఆ తర్వాత మందమర్రిలో ప్రోగ్రెసివ్ హైస్కూల్ పెట్టాను. 1985లో ప్రైవేట్ స్కూల్స్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యాను. అప్పుడు మేం ఊర్లలో వయోజన విద్యకోసం లక్షెట్‌పేట్ నుంచి పెద్దవాళ్లందరికీ పలకలు తెచ్చి అందరికీ చదువు చెప్పించేవాళ్లం. తక్కువ ఫీజులకు ఎక్కువ చదువు అనే కాన్సెప్ట్‌తో నిరక్షరాస్యతని తొలగించడానికి పిల్లలకు టాలెంట్ టెస్ట్‌లు, వ్యాసరచన పోటీలు, స్పీచ్ పోటీలు పెట్టి ఎంకరేజ్ చేసేవాళ్లం. రక్తదాతల సంఘం పెట్టి చాలా మందికి సహాయం చేశాం. డోనర్స్ దొరకకపోతే మేమే రక్తం ఇచ్చేవాళ్లం.

రాజకీయాల్లోకి..
రాజకీయాల్లోకి నా యంగ్‌లైఫ్‌లోనే వచ్చాను. 1994లో బి.ఎస్.పి తరపున ఎన్నికల్లో పోటీ చేసిన. కానీ ఓడిపోయిన. ఎన్నికల సమయంలో నా స్కూల్‌ను సగం అమ్మేయాల్సి వచ్చింది. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డా. అప్పుడు నా ఫ్రెండ్స్ సహకారంతో మళ్లీ స్కూల్ స్టార్ట్ చేశాను. స్టార్టింగ్‌లో టీచర్లకు సాలరీ కూడా ఇవ్వడం కష్టమయ్యేది. నా దోస్తులే టీచర్లుగా మారారు. అలా డెవలప్ చేసి అమ్మేసిన స్కూల్‌ను కూడా కొనుకున్నాను. ఇక జీవితంలో రాజకీయాలు వద్దను కున్నా. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ని చూసి ఇన్‌స్పైరై మళ్లీ రాజకీయాల్లోకి వచ్చాను.

యంగేజ్‌లో ఆవేశం, ప్రేమ అన్నీ కలిసి ఉంటాయి. ఈ సమయంలో మన వెంట మంచి స్నేహితులు ఉండడం అవసరం. సో మీరూ మంచి స్నేహితులను ఎన్నుకోండి. మంచి పనులు చేయండి. అవే మిమ్మల్ని మీ గోల్ దగ్గరకి తీసుకెళ్తాయి. ఇప్పుడు నేను ఈ పొజిషన్‌లో ఉన్నానంటే నాకు యంగేజ్‌లో దొరికిన స్నేహితులే.