దమ్ములేని దద్దమ్మ పొన్నాల : ఈటెల

eetela rajender

తెలంగాణ జాతికి దివంగత సీఎం వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన అన్యాయాలను అడిగే దమ్ములేని దద్దమ్మ పొన్నాల లక్ష్మయ్య అని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ ధ్వజమెత్తారు. ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని విమర్శించారు. వైఎస్ హయాంలో ఇరిగేషన్ మంత్రిగా ఉండి ఆయన తెలంగాణ సంపదను దోచుకుపోతున్నపుడు పొన్నాల సంతకాలు పెట్టలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ రాజకీయ కుట్రలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు, నిధులు, ఉద్యోగాలు రాకుండా కుట్ర చేసిందా పొన్నాల కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్ల పంచన చేరి వారి మోకాళ్ల దగ్గర మోకరిల్లిండని విమర్శించారు. పొన్నాల అవాకులు, చెవాకులు మానాలని ఈటెల హెచ్చరించారు.