దేశంలోనే నంబర్‌వన్‌గా తెలంగాణ

-అందరం కలిసి బంగారు తెలంగాణను నిర్మించుకుందాం
-టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి భారీగా చేరికలు
-అలంపూర్ నేతలు, కార్యకర్తలను ఆహ్వానించిన మంత్రి జూపల్లి

Congress, Tdp leaders joins in TRD in the presence of jupally Krishna Rao

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా రూపుదిద్దుకుంటున్నదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై అన్ని పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని అన్నారు. తెలంగాణభవన్‌లో మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి జూపల్లి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్లు పోరాడి తెచ్చుకున్న రాష్ర్టాన్ని అందరం కలిసి బంగారు తెలంగాణగా మార్చుకుందామన్నారు. జోగులాంబ ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ నాగరాజు, పలువురు ఎంపీటీసీలు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరిన వారి జాబితాలో ఉన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మందా జగన్నాథం, మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు శివకుమార్, అలంపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.