డెయిరీ రైతుల సమస్యలు పరిష్కరిస్తా

కరీంనగర్ డెయిరీ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత మాజీ ప్రధాని, కరీంనగర్ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావు, క్షీర విప్లవకారుడు డాక్టర్ వర్గీస్ కురియన్ విగ్రహాలను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విజయ డెయిరీ రైతులకు అందిస్తున్న విధంగా లీటరు పాల సేకరణపై పెంచిన నాలుగు రూపాయలను కరీంనగర్ డెయిరీ పరిధిలోని రైతులకు అందించే విషయంపై సీఎంతో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, డెయిరీ రైతులు చేసిన సూచనలను సీఎం దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.

-ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్
-కరీంనగర్ డెయిరీలో పీవీ, కురియన్ విగ్రహాల ఆవిష్కరణ

Etela Rajender at Karimngarసమైక్య రాష్ట్రంలో పాలకులు పీవీని చిన్నచూపు చూశారని, తెలంగాణ ప్రభుత్వం గౌరవించిందని పేర్కొంటూ డెయిరీ ఆవరణలో ఇద్దరు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ చైర్మన్ సీహెచ్ రాజేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పీవీ నర్సింహారావు కుమార్తె పీవీ వాణి, ఎమ్మెల్యేలు టీ జీవన్‌రెడ్డి, గంగుల కమలాకర్, చెన్నమనేని రమేశ్, సోమారపు సత్యనారాయణ, వొడితెల సతీశ్‌కుమార్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తల ఉమ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ హాజరయ్యారు.