సీఎం కేసీఆర్‌ను కలిసిన యూఎస్ కాన్సులేట్ జనరల్

KCR-with-US-Consulate-delegates

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును యూఎస్ కాన్సులేట్ జనరల్ సీజే మైఖేల్ ములిన్స్ సోమవారం సచివాలయంలో కలిశారు. వారి మధ్య చర్చల వివరాలు తెలియరాలేదు. అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్‌కు మర్యాదపూర్వకంగా అభినందనలు తెలిపేందుకు అమెరికా రాయబారి వచ్చినట్లు సమాచారం. వీరి సమావేశంలో రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు కూడా ఉన్నారు.