బీజేపీ అవసరం దేశానికా- టీడీపీకా: హరీశ్

చంద్రబాబులాగ మాటలు మార్చేవారు ప్రపంచంలో ఎవరూ ఉండరని టీఆర్‌ఎస్ ఎల్‌పీ ఉప నేత హరీశ్‌రావు విమర్శించారు . మామ దగ్గరికి తీస్తే వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిండని ఎద్దేవా చేశారు. ఆలీబాబా 40 దొంగలని వైఎస్ కేబినెట్‌ను విమర్శించిన చంద్రబాబు …ఆ కేబినెట్‌లో పనిచేసిన వారినే పార్టీలో చేర్చుకుంటున్నారని తెలిపారు. బీజేపీ అవసరం భారతదేశానికా… తెలుగుదేశానికా అని ప్రశ్నించారు. మద్యపానం నిషేధాన్ని ఎత్తివేసి బెల్ట్‌షాపులను బార్లా తెరిచిన నేత చంద్రబాబు కాదా అని అడిగారు. భారత దేశంలో సంక్షోభం లేదు…తెలుగుదేశం సంక్షోభంలో ఉందని చంద్రబాబు చెప్పుకోవాలని తెలపారు. తెలుగుదేశం పార్టీని కాపాడటం ఎవరి వల్ల కాదన్నారు. బీజేపీ – టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఆత్మహత్యా సదృశ్యంలాగ ఉందన్నారు. చంద్రబాబును స్వయంప్రకాశం లేని చంద్రుడిగా హరీశ్ అభివర్ణించారు. చంద్రబాబు పొత్తులు లేకుండా ఏనాడైనా పొత్తు లేకుండా పోటీ చేసిండా, చంద్రబాబు ఒంటరిగా ఎప్పుడైనా ప్రజల ముందుకు పోయిండా అని ప్రశ్నించారు. వామపక్ష పార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేసిండని తెలిపారు. చంద్రబాబు సీమాంధ్ర సీఎం అయితే బీజేపీతో కలిసి తెలంగాణకు గండికొడ్తడని చెప్పారు. మోడీని అడ్డుపెట్టుకుని చంద్రబాబు లాభపడాలని చూస్తున్నాడని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాలను బీజేపీ తాకట్టు పెడ్తున్నదన్నారు.