బంగారు తెలంగాణను చేసి చూపిస్తాం: కేసీఆర్

హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను బలపరిస్తే బంగారు తెలంగాణను చేసి చూపిస్తామని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇవాళ తెలంగాణభవన్ వద్ద ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. తెలంగాణ ఇపుడు తన తలరాతను తానే రాసుకునే సమయమని, ఎన్నికల్లో ఎక్కువ ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు మనమే తెచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే కేంద్రాన్ని శాసించి నిధులను డిమాండ్ చేసి తెచ్చుకోవచ్చని, తెలంగాణను అభివద్ధి చేసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణలో ఇప్పుడున్న వైద్య విధానం సరిగాలేదని దాన్ని మార్చుతామని తెలిపారు. తెలంగాణకు పట్టిన సకల దరిద్రాలు తొలగాలంటే ఉచిత విద్యే మార్గమని తెలిపారు.