బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం : స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల

బంగారు తెలంగాణకు పునరంకితమవుదాం:స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి ఈటెల

Etela Rajendar 01

రాష్ట్ర అవతరణ నేపథ్యం లో తెలంగాణను అభివద్ధిపథంలో తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.. బంగారు తెలంగాణ నిర్మాణానికి పునరంకితమవుదామని ఆర్థిక,పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్ పరేడ్ మైదానంలో శుక్రవారం జాతీయపతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ తొలిపోరాట యోధుడు అనభేరి ప్రభాకర్‌రావు 105వ జయంతిలో పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు జరిగాయని, 1969లో ఉద్యమం రూపు దా ల్చిందని, 2001లో సీఎం కేసీఆర్ సారథ్యంలో తిరిగి ప్రారంభమైందన్నారు. ఇంత పెద్ద ఉద్యమానికి కరీంనగర్ వేదిక కావడం గర్వించ దగ్గ విషయమన్నారు. సుదీర్ఘ పోరాటాల సీఎం కేసీఆర్ నాయకత్వంలో తర్వాత 29వ రాష్ట్రంగా తెలంగాణ సాధించుకున్నామన్నారు.

పోరాటంలో అమరులైన వారందరినీ స్మరిస్తూ మంత్రి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టబోయే సంక్షేమ పథకాలు, మన ఊరు-మన ప్రణాళిక అంచనాలు, లక్ష్యాలను వివరించారు. 19న నిర్వహించే సర్వే అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలు అందించడానికి దోహదపడుతుందని తెలిపారు. వేడుకల్లో ఇన్‌చార్జ్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, ఎస్పీ శివకుమార్, జెడ్పీ చైర్మన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పుట్టమధు, బొడిగ శోభ, రసమయి బాలకిషన్, చెన్నమనేని రమేశ్, నగర మేయర్ రవీందర్‌సింగ్ పాల్గొన్నారు.