అర్హులందరికీ పింఛన్లు ఇస్తాం

అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆదివారం నిజామాబాద్ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ రై సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. అర్హులకు మాత్రమే పింఛన్లు అందించే క్రమంలో కాస్త ఆలస్యమవుతున్నదని, బోగస్ పింఛన్ల ఏరివేత కోసం క్షుణ్ణం గా పరిశీలిస్తున్నామని తెలిపారు.

-రానివారుంటే మళ్లీ దరఖాస్తులు తీసుకుంటాం: వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి

Telangana-Agriculture-Minister-Pocharam-Srinivas-Reddyదేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం వృద్ధులు, వింతంతులకు రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 చొప్పున పింఛన్ అందిస్తున్నదని వివరించారు. పదిహేను రోజుల్లో పరిశీల ప్రక్రియ పూర్తవుతుందని.. అందరికీ నెలనెలా పింఛన్లు అందుతాయన్నారు. ఒకవేళ ఎవరైనా తమకు పింఛన్ రాలేదని ఫిర్యాదు చేస్తే వారి దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. వీటిపై టాస్క్‌ఫోర్స్ వేసి విచారణ జరిపిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చూస్తామని పునరుద్ఘాటించారు.

ప్రతి ఇంటికీ రక్షిత నీటితో కూడిన నల్లా కనెక్షన్ అందించేలా వాటర్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొత్తం 3,069 చెరువుల్లో మొదటి ఏడాది 701 చెరువులను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్ దఫేదార్‌రాజు అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఆశన్నగా రి జీవన్‌రెడ్డి, హన్మంత్‌సింధే, ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జెడ్పీ సీఈవో రాజారాం, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు.