ఏపీ ప్యాకేజీలన్నీ.. తెలంగాణకూ ఇవ్వాలి

-చట్టంలో ఈ విషయం స్పష్టంగా ఉంది
-రెండు రాష్ర్టాలను మోడీ ప్రభుత్వం సమానంగా చూడాలి
-అన్ని రంగాల్లో వెనుకబడింది తెలంగాణే
-టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ కుమార్

Boinpally Vinod

రాష్ర్టాలకు ప్రత్యేక హోదా కల్పించడం, పన్నుల మినహాయింపులు రెండూ వేర్వేరు అంశాలు. ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్రం ఎటువంటి ప్యాకేజీ ఇచ్చినా అవి తెలంగాణ రాష్ర్టానికి కూడా ఇవ్వాలి. ఇవి నా మాటలు కావు.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనే ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు అని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు, మినహాయింపులు ఇస్తున్నదని వస్తున్న వార్తలను ఆయన అపోహలుగా కొట్టిపారేశారు. వాస్తవాలను ప్రజలకు వివరించి అపోహలను తొలగించేందుకు మీడియా ప్రముఖ పాత్ర పోషించాలన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఎటువంటి ప్రత్యేక వసతులు కల్పించినా.. అవి రెండు రాష్ర్టాలకు వర్తిస్తాయని బిల్లులో, చట్టంలో ఉందని చెప్పారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 94(1)లోని సదరు పేరాను చదివి వినిపించారు. ఈ విషయంలో కొంతమంది వ్యక్తులు, పారిశ్రామికవేత్తలు, మీడియా గందరగోళాన్ని సష్టిస్తున్నారని విమర్శించారు. కాగా, మోడీ ప్రభుత్వం పార్లమెంట్ చట్టాలను అమలు చేస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఏ ప్రభుత్వమైనా చట్టంలోని అంశాలను పాటించాల్సిందేనని, అందుకు మోడీ ప్రభుత్వం మినహాయింపేమీ కాదన్నారు. ఇదే విషయాన్ని తాజాగా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా కూడా చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వదల్చుకుంటే అందుకు తెలంగాణకే ఎక్కువ అవకాశాలున్నాయన్నారు. వెనుకబాటుతనం నమోదైన జిల్లాల్లో తెలంగాణ జిల్లాలే ఎక్కువగా ఉన్నాయని ప్రణాళికా సంఘం అధికారికంగా ప్రకటించిందని చెప్పారు.