అధికారికంగా ఈశ్వరీబాయి వర్ధంతి

తెలంగాణ స్ఫూర్తి ప్రదాతల్లో ఒకరైన ఈశ్వరీబాయి వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

KCR

ఈ విషయమై సోమవారం ఈశ్వరీబాయి కుమార్తె, ఎమ్మెల్యే గీతారెడ్డి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 1969 ఉద్యమంలో ఆమె ప్రసంగాలు తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తపించారన్నారు. వచ్చేనెల 24న ఈశ్వరీబాయి వర్థంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు. ఆమె జీవితచరిత్రను పాఠ్యాంశాల్లో పొందుపరుస్తామన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తంచేసిన గీతారెడ్డి.. ఇంత తొందరగా సానుకూల నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదన్నారు.