అధిక సాయం అందించండి

కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నిహల్ చంద్ తో సమావేశమైన తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు

 NIRD&PR కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి కె తారక రామారావు
 తెలంగాణకి కేంద్ర పంచాయితీరాజ్ శాఖ ద్వారా అధిక సాయం అందించాలన్న మంత్రి
 కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వేంటనే విడుదల చేయాలని కొరిన మంత్రి

KTR with Union Minister for Panchayat Raj Nihal Chand

తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర పంచాయితీరాజ్ శాఖ ద్వారా అధిక సాయం అందిచాలని కేంద్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి నిహల్ చంద్ ని తెలంగాణ పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు కోరారు. ఓకరోజు పర్యటన కోసం హైదరాబాద్ నగరానికి వచ్చేసిన కేంద్ర మంత్రిని పంచాయితీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామా రావు నేషనల్ ఇనిస్టిట్యూట్ అప్ పంచాయితీరాజ్ మరియు రూరల్ డెవలప్ మెంట్, రాజేంద్ర నగర్ లో కలిసారు. తెలంగాణలో పంచాయతీరాజ్ శాఖ ద్వారా జరుగుతున్న పలు కార్యక్రమాల గురించి వివరించారు. ముఖ్యంగా గత ఏడాది కాలంగా తాముచేపట్టిన అనేక కార్యక్రమాలను మంత్రి కె.తారక రామారావు తెలియజేశారు. పంచాయితీరాజ్ శాఖ ద్వార చేపట్టిన మన ఉరూ మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే వంటి కార్యక్రమాల గురించి వివరించిన మంత్రి, ప్రస్తుతం తెలంగాన ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరిత హారం కార్యక్రమం గురించి వివరించారు. హరిత హరం లాంటి వినూత్నమైన కార్యక్రమానికి పంచాయితీరాజ్ తరపున, జాతీయ ఉపాది హమీ పధకాన్ని అనుసంధానం చేస్తున్న తీరుతోపాటు, గ్రామ స్ధాయి నుండి పంచాయితీరాజ్ ప్రజాప్రతినిధులను కలుపుకుని పని చేస్తున్న తీరుని మంత్రి నిహాల్ చంద్ కి వివరించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రావాల్సిన అనేక నిధుల గురించి ప్రస్తావించిన మంత్రి….పదమూడవ అర్ధిక సంఘం నిధుల బాకాయిలను వేంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఏడాది బడ్జెట్ తర్వతా అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలను రద్దు చేసిన కేంద్రం….కొన్నిమంచి పథకాలను తిరిగి కొనసాగించాలని కోరారు. బిఅర్ జియప్ (backward region grant fund) పూర్తిగా రద్దు చేయడంతో తొమ్మిది జిల్లాలకి రావాల్సిన నిధుల్లో భారీగా కోత పడిందని, ఈనేపథ్యంతో రాబోయే పథకాల్లో ఈ మేరకి తమకి నిధులు కేటాయించాలని విజ్ఘప్తి చేశారు. అర్జీపియస్ ఏ పథకంలోనూ రావాల్సిన బకాయిలను ఇవ్వాలని కొరారు. కేంద్రం ప్రతి ఓక్కరికి ఇళ్లు అనే నినాదంతో ముందకు తెస్తున్న నూతన పక్కాగృహల కల్పన కార్యక్రమంలో తెలంగాణకి అధిక ప్రాధాన్యం ఇచ్చేలా చూడాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పేదలకి డబులు బెడ్ రూం కట్టించేందుకు తీసుకుంటున్న చర్యలను అయన కేంద్ర మంత్రికి వివరించారు.

పంచాయితిరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపిన అన్ని విషయాలను సానుకూలంగా పరిశీస్తామని తెలిపిన కేంద్ర మంత్రి నిహాల్ చంద్ త్వరలోనే ఈ మేరకి సమాచారం ఇస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణలోని పంచాయితీరాజ్ వ్యవస్ధ గురించి అడిగి తెలుసుకున్న అయన, ఇక్కడి గ్రామా పంచాయితీల ద్వార చేపట్టే కార్యక్రమాలు, పాలనలో వాటి పాత్రగురించి మంత్రి కె.తారక రామారావుతో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాపంచాయితీలతో పాటు స్ధానిక సంస్ధలను బలోపేతం చేసేందుకు సిధ్దంగా ఉన్నదని, ఈ మేరకి వాటి ప్రతినిధులకి దేశంలో ఏక్కడాలేని విధంగా గౌరవ వేతనాలు పెంచిన తీరుని వివరించారు. తాము పంచాయితీరాజ్ శాఖ తరఫున వేస్తున్న రోడ్ల గురించి వివరించారు. తమ అయిదేళ్ల కాలంలోగా ప్రతి గ్రామానికి రోడ్లుండేలా చర్యలుతీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.

కేంద్ర మంత్రిని కలిసిన వారితో మంత్రితోపాటు పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ తోపాటు, పంచాయితీరాజ్ కమీషనర్ అనితా రామచంద్రన్ , అర్ డబ్యూయస్ ఈఏన్ సీ సురేందర్ రెడ్డి ఉన్నారు.