Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

రైతు బంధుకు జేజేలు

-రాష్ట్రవ్యాప్తంగా చెక్కులు, బుక్కుల పండుగ
-చెక్కుల పంపిణీ కేంద్రాల్లో కోలాహలం
-డప్పుల మోత, బోనాలతో ఆహ్వానాలు
-మామిడి తోరణాలతో వేదికల అలంకరణలు
-పలు సభల్లో భావోద్వేగ సన్నివేశాలు
-చెక్కులు అందుకుని మురిసిపోతున్న రైతులు
-ఆయా జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు
-స్వచ్ఛందంగా పెట్టుబడి వదులుకున్న 48 మంది
-రెండో రోజు రైతుబంధు 1372 గ్రామాల్లో
-4.48 లక్షల చెక్కుల పంపిణీ
-రైతులు డ్రా చేసుకున్న నగదు రూ.227 కోట్లు

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రైతుబంధు పథకం దిగ్విజయంగా కొనసాగుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చెక్కులు, పాస్‌బుక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పండుగ వాతావరణంలో సజావుగా నిర్వహిస్తున్నారు. పంటసాయం అందుకున్న రైతులు ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. రెండోరోజైన శుక్రవారం 1,372 గ్రామాల్లో 4.48 లక్షల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. సాయంత్రంవరకు రూ.227 కోట్ల నగదును రైతులు డ్రా చేసుకున్నారు. మొత్తంగా ఈ రెండు రోజుల వ్యవధిలో మూడువేల గ్రామాల్లో చెక్కులు, పాస్‌పుస్తకాల పంపిణీ పూర్తయింది. మొత్తం 8.27 లక్షల చెక్కులు రైతులకు అందాయి. 48 మంది పెట్టుబడి సాయాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.

శుక్రవారం జరిగిన కార్యక్రమాల్లో స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఉపముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మా రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, జోగు రామన్న, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత బీ వినోద్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలుచోట్ల చెక్కులు అందుకున్న రైతులు భావోద్వేగానికి గురయ్యారు. సిరిసిల్ల జిల్లాలో చెక్కులు అందించిన మంత్రి కేటీఆర్‌ను హత్తుకుంటూ ఆనందభాష్పాలు రాల్చారు.

వరంగల్‌లో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ పాల్గొన్న సభల్లో ఆద్యంతం నిలబడి చప్పట్లు కొడుతూ హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. డోర్నకల్ తదితర ప్రాంతాల్లో సభావేదికను మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించి కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. చెక్కులు అందుకుంటున్న రైతులపై పూలవాన కురిసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట, ముస్తాబాద్ మండల కేంద్రాల్లో రైతుబంధు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌కు ప్రజలు డప్పుచప్పుళ్లతో, మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. కోనరావుపేట మండలంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు రైతుబంధు పథకాన్ని అందజేసి ప్రారంభించారు. చెక్కులు అందుకున్న చాలామంది రైతులు గంటలోపే బ్యాంకుల్లో నగదు తీసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలుచోట్ల కొందరు రైతులకు పాస్‌పుస్తకాలు లేనప్పటికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు చెక్కులు అందించారు.

Every contribution that you make can make a difference.

Please contribute generously to the TRS.

MAKE A DONATION NOW