గత వైభవం తీసుకొస్తాం..

ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసానికి గురైన చిన్ననీటి వనరులైన చెరువులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకొస్తాం. నదీ జలాలతో చెరువులను నింపి హరిత తెలంగాణ సాధిస్తాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరు, దోమకొండ మండలాల్లోని పలు చెరువుల పనులను మంత్రి ప్రారంభించారు. భిక్కనూరు మండలం కాచాపూర్‌లో పెద్దచెరువులో రూ.73 లక్షల 55 వేల నిధులతో, దోమకొండ మండలం బీబీపేట పెద్ద చెరువులో రూ.కోటీ 49 లక్షలతో పనులకు శ్రీకారం చుట్టారు.

Harish Rao participated in Mission Kakatiya programme in Kamareddy

-ఉమ్మడిరాష్ట్రంలో చిన్ననీటి వనరులు విధ్వంసం
-హరిత తెలంగాణ కోసమే మిషన్ కాకతీయ
-భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు
-జోరుగా కొనసాగుతున్న చెరువుల పునరుద్ధరణ
ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రాణహిత నీటిని మళ్లించి బీబీపేట్ పెద్ద చెరువుకు పూర్వవైభవం తీసుకొస్తామన్నారు. బీబీపేట చెరువుకు ఘనమైన చరిత్ర ఉం దని, ఇంతపెద్ద చెరువు ఎండిపోవడంతో గుండె చలించిపోతున్నదన్నారు. ఐదువందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువు 3600 ఎకరాల ఆయకట్టుకు నీరందించేదని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం మొట్లగూడెం చెరువులో మిషన్ కాకతీయ పనులను మంత్రులు కేటీఆర్, తుమ్మల పరిశీలించారు. పూడిక మట్టి ఎత్తి ట్రాక్టర్లలో పోసి పనుల్లో పాల్గొన్నారు.

చెరువులే పల్లెలకు జీవనాధారం: స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి
సాగునీరు సమృద్ధిగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రేగొండ మండలంలోని గోరికొత్తపల్లి, కోడవటంచ, పోచంపల్లి గ్రామాల్లో చెరువుల పూడికతీత పనులను ఆయన ప్రారంభించారు. చెరువులే గ్రామాలకు జీవనాధారమని,సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసి రైతు ఆత్మహత్యలు లేని ఆదర్శరాష్ట్రంగా మార్చడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగానే మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుల శ్రేయస్సే ధ్యేయంగా భావించి సీఎం కేసీఆర్ ముందుచూపుతో మిషన్‌కాకతీయ పథకాన్ని చేపట్టారని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కొనియాడారు. మరిపెడ మండలంలోని ఉగ్గంపల్లిలోని పులకమ్మ చెరువు, ఊరకుంట చెరువుల పనులను ఆయన ప్రారంభించారు.

పాలమూరులో ఉధృతంగా పనులు
మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం చారగొండ పెద్దచెరువు పనులను వైద్యారోగ్యశాఖ మంత్రి డాక్టర్ లకా్ష్మరెడ్డి ప్రారంభించారు. సుమారు 1700 ఎకరాల ఆయకట్టుగల చెరువు అభివృద్ధి పనులకు రూ. 52లక్షల నిధులు మంజూరయ్యాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మర్రిజనార్దన్‌రెడ్డి, ఆలవెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వలబాల్‌రాజు పాల్గొన్నారు. నారాయణపేట మండలంలోని బండగొండలోని చౌదరి చెరువు పునరుద్ధరణ పనులను భారీ పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. వనపర్తి మండలం అప్పాయిపల్లి ఊరచెరువులో పనులను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పరిశీలించారు. రైతులకు సాగునీటికోసమే ప్రభు త్వం మిషన్ కాకతీయ పనులను చేపట్టిందన్నారు. చెరువులు నిండితే రెండుకార్లకు పంటసాగు చేయడానికి నీరందుతుందన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల్ పం చాయితీ పరిధిలోని అన్మాస్‌పల్లి చెరువు పనులను ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి ప్రారంభించారు.

list1

గ్రామస్తులతో కలసి మిషన్ కాకతీయ పాటల సీడీలను ఆవిష్కరించారు. తలకొండపల్లి మండలం చుక్కాపూర్ శివారులో రూ.40 లక్షలతో చేపట్టిన చుక్కా యి చెరువు అభివృద్ధి పనులను కూడా ప్రారంభించారు. వంగూరు మండలంలోని డిండిచింతపల్లిలో రూ.54 లక్షలతో మంజూరైన మొగిలి చెరువు పనులను ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు ప్రారంభించారు. మొగిలి చెరువు అభివృద్ధి చెందితే సుమారు 100 ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు.